Telugu News » Rajasingh: దమ్ముంటే అసదుద్దీన్ ఓవైసీ నాపై పోటీ చేయాలి.. రాజాసింగ్ సవాల్!

Rajasingh: దమ్ముంటే అసదుద్దీన్ ఓవైసీ నాపై పోటీ చేయాలి.. రాజాసింగ్ సవాల్!

తన సస్పెషన్‌ను పార్టీ అధిష్టానం ఎత్తివేసి మళ్లీ తనకే ఎమ్మెల్యే సీటు కేటాయించడంపట్ల రాజాసింగ్ హర్షం వ్యక్తం చేశారు. కరీంనగర్‌లో మహాశక్తి ఆలయాన్ని రాజాసింగ్, బండి సంజయ్ దర్శించుకున్నారు.

by Mano
Rajasingh: Asaduddin Owaisi should compete against me if he dares.. Rajasingh's challenge!

దమ్ముంటే అసదుద్దీన్ ఓవైసీ తనపై పోటీ చేయాలని బీజేపీ గోషామాల్ ఎమ్మెల్యే అభ్యర్థి(Bjp goshamahal mla candidate) రాజాసింగ్‌(Rajasingh) సవాల్ విసిరారు. తన సస్పెషన్‌ను పార్టీ అధిష్టానం ఎత్తివేసి మళ్లీ తనకే ఎమ్మెల్యే సీటు కేటాయించడంపట్ల రాజాసింగ్ హర్షం వ్యక్తం చేశారు. కరీంనగర్‌లో మహాశక్తి ఆలయాన్ని రాజాసింగ్, బండి సంజయ్ దర్శించుకున్నారు.

Rajasingh: Asaduddin Owaisi should compete against me if he dares.. Rajasingh's challenge!

అనంతరం రాజాసింగ్‌ మాట్లాడుతూ.. మునావర్‌ను కేటీఆర్ హైదరాబాద్‌కు తీసుకువస్తే అడ్డుకున్నానని స్పష్టం చేశారు. తన సస్పెన్షన్‌ ఎత్తివేసినందుకు పార్టీకి ధన్యవాదాలు తెలిపారు. మహలక్ష్మీ అమ్మవారిని దర్శించుకొని కేసీఆర్ కుటుంబాన్ని తరిమేయాలని సంకల్పం తీసుకున్నట్లు తెలిపారు. బంగారు తెలంగాణ పేరుతో కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు.

ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరారు. కేసీఆర్ చేయలేని బంగారు తెలంగాణను మేము చేసి చూపిస్తామని వాగ్దానం చేశారు. కరీంనగర్ నుంచి ఎమ్మెల్యేగా బండి సంజయ్ గెలిపించాలన్నారు. దమ్ముంటే తన మీద అసదుద్దీన్ ఓవైసీ పోటీ చేయాలని ఈ సందర్భంగా సవాల్ విసిరారు. ఎంఐఎంను పెంచి పోషించింది కాంగ్రెస్సే అని రాజాసింగ్ ఆరోపించారు. కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్‌లు ఒక్కటేనని వ్యాఖ్యానించారు.

నియోజకవర్గంలో పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా సపోర్ట్ చేస్తానని చెప్పిన విక్రమ్ గౌడ్‌ తన తరఫున ప్రచారం పాల్గొంటారని చెప్పారు. తాను 14 నెలలు భారతీయ జనతా పార్టీ(Bjp)కి దూరంగా ఉన్నానని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై సస్పెన్షన్ ఎత్తేవేసి మళ్లీ టికెట్ ఇచ్చినందుకు బీజేపీ హై కమాండ్‌కు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ ఎక్కడ ప్రచారం చేయమన్నా చేస్తానని చెప్పుకొచ్చారు.

ఈసారి తన హ్యాట్రిక్ విజయం ఖాయమని చెప్పారు రాజాసింగ్. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ గ్రాఫ్ తగ్గిందనేది ప్రచారం మాత్రమేనని కొట్టిపారేశారు. దాదాపు ఏడాది తరువాత నిన్న(ఆదివారం) బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన భారీ ర్యాలీతో పార్టీ కార్యాలయానికి వెళ్లారు.

You may also like

Leave a Comment