Telugu News » Rajnath Singh : దేశ ఆర్థిక వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేసిన కేంద్ర రక్షణశాఖ మంత్రి..!!

Rajnath Singh : దేశ ఆర్థిక వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేసిన కేంద్ర రక్షణశాఖ మంత్రి..!!

భారత్‌ నేడు ప్రపంచంలోని ఐదు అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థ (economy)ల్లో ఒకటిగా ఉందన్నారు. తొలి మూడు ఆర్థిక వ్యవస్థల్లో 2027 నాటికి ఒకటిగా ఉంటామని ఎంతోమంది నిపుణులు చెప్పిన విషయాన్ని రాజ్‌నాథ్‌ సింగ్‌ గుర్తు చేశారు.

by Venu
Rajnathsingh: Terrorists will be killed even if they flee to Pakistan: Rajnath Singh

దేశ ఆర్థిక వ్యవస్థపై, కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ (Defense Minister Rajnath Singh).. కీలక వ్యాఖ్యలు చేశారు. 96వ ఏజీఎం (AGM)లో పాల్గొన్న సందర్భంగా, దేశ ఆర్థికాభివృద్ధిపై మాట్లాడిన రాజ్‌నాథ్‌ ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా నేడు భారత్ (India) ఉందని తెలిపారు. ఇలాంటి పరిస్థితిలో భారత్ ఆర్థిక ప్రగతి ఇతర దేశాల ఆర్థిక ప్రగతిపై ప్రభావం చూపడం సహజమేనని వెల్లడించారు.

Rajnathsingh telangana tour: Union Minister of Telangana Rajnath Singh today

నేటి కాలంలో భారతదేశాన్ని గ్రోత్ ఇంజిన్ అని పిలవడానికి కారణం ఇదే అని తెలిపిన రాజ్‌నాథ్‌ సింగ్‌.. భారత్‌ నేడు ప్రపంచంలోని ఐదు అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థ (economy)ల్లో ఒకటిగా ఉందన్నారు. తొలి మూడు ఆర్థిక వ్యవస్థల్లో 2027 నాటికి ఒకటిగా ఉంటామని ఎంతోమంది నిపుణులు చెప్పిన విషయాన్ని రాజ్‌నాథ్‌ సింగ్‌ గుర్తు చేశారు. భారత్ అభివృద్ధిలో వేగం పుంజుకోంటుండగా.. చైనా అభివృద్ధిలో వేగం తగ్గుతుందని నివేదికలు వెల్లడించినట్టు రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు..

అంతకుముందు, ఫిక్కీ (FICCI) ఏజీఎంను ఉద్దేశించి కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ మాట్లాడుతూ.. 2047 నాటికి భారత్‌ను 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఇందుకోసం ప్రభుత్వం, పరిశ్రమలు సమిష్టిగా ప్రయత్నాలు చేస్తున్నట్టు పీయూష్‌ గోయల్‌ వెల్లడించారు. భారత్‌ ఇప్పటికే ప్రపంచంలోని ఐదు అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థల్లో చేరిందని పీయూష్‌ గోయల్‌ తెలిపారు..

దేశంలో 600 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలు ఉన్నాయన్న పీయూష్‌ గోయల్‌.. ఇన్వెస్టర్లు భారత్‌కు తరలిరావడం శుభ సూచీకగా పేర్కొన్నారు. ఇన్వెస్టర్లుకు మన ఆర్థిక వ్యవస్థపై విశ్వాసం పెరిగిందని తెలిపన పీయూష్‌ గోయల్‌.. భారతీయ కరెన్సీని ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైనదిగా విదేశీ బ్యాంకర్లు పేర్కొంటున్నట్లు వెల్లడించారు..

You may also like

Leave a Comment