తెలంగాణ(Telangana)లో ఎలాగైనా పాగా వేసేందుకు బీజేపీ(Bjp) విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో అధికార బీఆర్ఎస్(Brs), కాంగ్రెస్(Congress) పార్టీలకు దీటుగా ప్రచారంలోకి దిగింది. అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తూనే మరోవైపు క్షేత్రస్థాయిలో ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు వ్యూహాలను రచిస్తోంది.
ఈ నేపథ్యంలో జాతీయ నేతలు ఒక్కొక్కరిగా తెలంగాణ పర్యటనకు వచ్చి తమ ప్రసంగాలతో బీఆర్ఎస్, కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇవాళ రాష్ట్రంలో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పర్యటించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 12.10 గంటలకు హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయానికి రాజ్‌నాథ్ సింగ్ చేరుకుంటారు. అక్కడ ఆయనకు రాష్ట్ర నేతలు ఘనస్వాగతం పలకనున్నారు.
అక్కడి నుంచి జమ్మికుంట, మహేశ్వరంలో నిర్వహించే సభల్లో రాజ్‌నాథ్ ప్రసంగిస్తారు. అనంతరం శంషాబాద్ నుంచి హెలికాప్టర్‌లో రాజ్‌నాథ్ సింగ్ హుజూరాబాద్‌కు వెళ్తారు. హుజూరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో జమ్మికుంటకు చేరుకుంటారు. అక్కడ సభలో ప్రసంగించిన అనంతరం మహేశ్వరానికి బయల్దేరతారు. మహేశ్వరం మున్సిపల్ గ్రౌండ్‌లో నిర్వహించే సభలో పాల్గొని తిరిగి రాత్రి 7.35 గంటలకు ఢిల్లీకి పయనమవుతారు.