ఛత్తీస్ ఘడ్ లోని సాయిమౌళి ఆలయ కమిటీ వినూత్న ఆలోచన చేసింది. రానున్న రాఖీపౌర్ణమికి ఓ స్పెషల్ రక్షాబంధన్(Rakshabandhan)ని రెడీ చేస్తోంది. కొన్ని నెలల పాటు కష్టపడి రూపొందించిన రక్షాబంధన్ ని పంజాబ్ లోని ఉధం పూర్ సైనికులకు పంపించేందుకు సన్నాహాలు చేస్తోంది.
దీని పొడవు 27 అడుగులు, కాగా వెడల్పు 6 అడుగులు. అంతేకాదు
ఈ స్పెషల్ రక్షాబంధన్ లో 21 మంది వీరజవాన్ల ఫోటోలను పొందుపరిచింది. భారత ప్రభుత్వం ఇటీవలే వీరి పేర్లను అండమాన్ నికోబార్(Andaman Nicobar) దీవులకు పెట్టింది.
ఈ నేపథ్యంలో ఛత్తీస్ గఢ్ సాయి మౌళి ఆలయ కమిటీ సభ్యులు ఈ స్పెషల్ రాఖీని రూపొందించడం విశేషం. ఈ రాఖీలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము(Draupadi Murmu),ప్రధాని నరేంద్రమోదీ(Narendra Modi),రక్షణశాఖా మంత్రి రాజనాథ్ సింఘ్ చిత్రాలు రూపొందించడం మరో ప్రత్యేకత.
గతేడాది ఇదే కమిటీ రెండున్నర అడుగుల వెడల్పు, 15 అడుగుల పొడవున్న రాఖీని తయారు చేసి లద్దాక్ సైనికులకు పంపించగా ఈ యేడాది ఉధంపూర్ సైనికులకు 27 అడుగుల పొడవు,6 అడుగుల వెడల్పుతో రాఖీని తయారు చేసి పంపిస్తోంది.