Telugu News » Congress List : కాంగ్రెస్ అభ్యర్థుల లిస్ట్ ఎప్పుడు?

Congress List : కాంగ్రెస్ అభ్యర్థుల లిస్ట్ ఎప్పుడు?

కాంగ్రెస్‌ జాబితా ఎప్పుడు ఉంటుందో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు, బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటనపైనా సెటైర్లు వేశారు.

by admin

సీఎం కేసీఆర్ (CM KCR) బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటనతో రాజకీయ వేడి రాజుకుంది. మిగిలిన పార్టీలు కూడా అభ్యర్థులపై ఫోకస్ పెట్టాయి. ఇప్పటికే కాంగ్రెస్ (Congress) పార్టీ ఆశావహుల కోసం అప్లికేషన్ సిస్టమ్ ను అమల్లోకి తెచ్చింది. ఈ ప్రక్రియ ఈనెల 25 వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత వచ్చిన అప్లికేషన్లను పరిశీలించడం.. ఏ నియోజకవర్గానికి ఎంతమంది పోటీలో ఉన్నారో లెక్కగట్టడం.. తాము చేసుకున్న సర్వేల ఆధారంగా ఏ అభ్యర్థికి టికెట్ ఇస్తే గెలుస్తాం అనే అంశాలపై అనేక పరిశీలనల తర్వాత ఫైనల్ లిస్ట్ ప్రకటిస్తారు. అంటే, ఇది ఇప్పుడప్పుడే తేలే వ్యవహారంలా కనిపించడం లేదు.

కాంగ్రెస్‌ జాబితా ఎప్పుడు ఉంటుందో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు, బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటనపైనా సెటైర్లు వేశారు. అంత తొందరెందుకని అన్నారు. కేసీఆర్‌ ఆత్రం చూస్తుంటే, కోయిల ముందే కూసినట్టుగా ఉందని ఎద్దేవ చేశారు. కాంగ్రెస్‌ కూడా త్వరలోనే అభ్యర్ధుల్ని ప్రకటిస్తుందని.. ఆల్రెడీ ప్రొసీజర్‌ కూడా స్టార్ట్‌ అయ్యిందన్నారు. ఎన్నికల షెడ్యూల్‌ తర్వాతో లేక నోటిఫికేషన్‌ వచ్చాకో తమ లిస్ట్‌ ఉండొచ్చనే సంకేతాలిచ్చారు భట్టి.

తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రమోట్ చేసుకుంటున్నా.. గత రెండు పర్యాయాలు కాంగ్రెస్ కు ప్రజలు అధికారాన్ని కట్టబెట్టలేదు. ఈసారి మాత్రం పక్కాగా గెలుస్తామని ఆ పార్టీ నేతలు ధీమాగా చెప్తున్నారు. అయితే.. పోటీ చేసేందుకు కాంగ్రెస్ దగ్గర సరైన అభ్యర్థులే లేరని బీఆర్ఎస్ సైడ్ నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. లేదు, బీఆర్ఎస్ ఓటమి పక్కా అని హస్తం నేతలు అంటున్నారు. ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతను సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్నారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ నాయకుల పనితీరుతో ప్రజలు పడిన ఇబ్బందులను ఇంటింటికి తీసుకెళ్లే దిశలో పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.

కర్ణాటక విజయంతో ఊపు మీదున్న కాంగ్రెస్ తెలంగాణలోనూ పాగా వేయాలని చూస్తోంది. ఈ క్రమంలోనే ఇంటిటి ప్రచారానికి తెరతీసింది. నెల రోజులపాటు పార్టీ నేతలు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రజలకు భరోసా కల్పించాలని.. ప్రభుత్వ వ్యతిరేక అంశాలపై ఫోకస్ పెట్టాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇప్పటికే పార్టీ నేతలు ఆ పనుల్లో నిమగ్నమయ్యారు. మొత్తంగా వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ ముందుకెళ్తోంది. గెలుపు గుర్రాలనే బరిలోకి దింపాలని చూస్తోంది.

You may also like

Leave a Comment