టాలీవుడ్ (Tollywood) గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా, తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ అనే మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే.. వీరిద్దరి కాంబో అనగానే ఈ మూవీపై భారీ హైప్ నెలకొంది. ఇక స్క్రీన్ పైనే కాదు.. ఆఫ్ లైన్ లో కూడా చరణ్ కి మంచి ఆదరణ ఉంది. ఈ క్రమంలో మెగా పవర్ స్టార్ కి అరుదైన గౌరవం దక్కింది.
చెన్నై (Chennai)లో ఉన్న ఓ ప్రముఖ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రధానం చేయనుంది. వేల్స్ వర్చువల్ యూనివర్సిటీ స్నాతకోత్సవ వేడుకలు ఈ నెల 13న జరగనున్నాయి. సినీ నిర్మాత, యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ అయిన ఈసరి గణేష్ ఆధ్వర్యంలో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి రామ్ చరణ్ ముఖ్య అతిధిగా హాజరవనున్నారు..
మరోవైపు కళా రంగానికి చేస్తోన్న అత్యుత్తమ సేవను గుర్తించిన వేల్స్ యూనివర్సిటీ చెర్రీకి గౌరవ డాక్టరేట్ ప్రధానం చేయనుంది. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అధ్యక్షుడు డీజీ సీతారాం ఈ పురస్కారాన్ని రామ్ చరణ్ కు అందజేయనున్నారు. ఇదిలా ఉండగా.. గతంలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కి కూడా వేల్స్ యూనివర్సిటీ డాక్టరేట్ ని అందించిన సంగతి తెలిసిందే.
కానీ ఆయన సున్నితంగా తిరస్కరించారు. కాగా ప్రస్తుతం అబ్బాయి రామ్ చరణ్ కి ఈ గౌరవం రావడం విశేషం. మరోవైపు తమ హీరోకి అరుదైన గౌరవడం దక్కడం పట్ల మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు..