అయోధ్య (Ayodhya)లో రామ్ లల్లా (Ram Lalla) విగ్రహంపై కాంగ్రెస్ (Congress) సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ (Digvijay Singh) ప్రశ్నలు వేశారు. గర్బగుడిలో ప్రతిష్టించింది పాత విగ్రహమని ప్రశ్నించారు. తాను మొదటి నుంచి ప్రశ్నిస్తూనే ఉన్నానని చెప్పారు.
గతంలో వివాదాస్పదమైన ధ్వంసమైన రాముని విగ్రహం ఎక్కడ ఉందని ఆయన అడిగారు. ఇప్పుడు రెండవ విగ్రహాన్ని ప్రతిష్టించాల్సిన అవసరం ఏమిటి? అని నిలదీశారు. రామ మందిరంలో ప్రతిష్టంచబోయే విగ్రహం బాల రాముడి రూపంలో ఉండాలని, తల్లి కౌసల్య ఒడిలో ఉండాలని గురు శంకరాచార్య స్వామి స్వరూపానంద జీ మహరాజ్ వెల్లడించారని పేర్కొన్నారు.
కానీ ఆలయంలో ప్రతిష్టించిన విగ్రహం చిన్న పిల్లాడిలా కనిపించడం లేదన్నారు. ఇది ఇలా వుంటే కొత్త విగ్రహాన్ని ప్రతిష్టించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిర్వాణి అఖారాకు చెందిన మహంత్ ధర్మదాస్ పోస్టు చేశారు. తాజాగా ఆ పోస్టును దిగ్విజయ్ సింగ్ షేర్ చేశారు.
దాంతో పాటు ఒక వార్తకు సంబంధించిన వీడియోను కూడా పంచుకున్నారు. కోర్టు తీర్పు ఎవరికి అనుకూలంగా వచ్చిందో వారినే గర్బగుడిలో ప్రతిష్టించాలని ధర్మదాస్ వెల్లడించారు. అయోధ్య వివాదంలో ధర్మదాస్ పాత విగ్రహానికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. పాత విగ్రహం స్థానంలో మరో విగ్రహాన్ని ఎవరూ ఏర్పాటు చేయకూడాదని పేర్కొన్నారు