యావత్ దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రోజు రానేవచ్చింది. అయోధ్య(Ayodhya)లో శ్రీరామ జన్మభూమిలో నిర్మించిన రామ మందిర(Ram Mandir)ప్రారంభోత్సవ మహోత్సవంలో ప్రధాని మోడీ(PM Modi) పాల్గొననున్నారు. బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపన అంగరంగ వైభవంగా జరుగనుంది. ఈ ఆలయ నిర్మాణంలో కార్మికుల శ్రమ ఎంతో ఉంది. వారితో ప్రధాని సంభాషించనున్నారు.
అయోధ్య రామాలయంలో ఎన్నో ప్రత్యేకతలు దాగిఉన్నాయి. ఆలయాన్ని పూర్తిగా దేశ సంప్రదాయ, స్వదేశీ సాంకేతికతతో పాటు నగర శైలిలో నిర్మించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆలయ నిర్మాణానికి ఇప్పటి వరకు రూ.1100 కోట్లు ఖర్చు చేయగా మరో రూ.300 కోట్లు ఖర్చు అయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఆలయ పునాది 14 మీటర్ల మందంతో రోలర్-కాంపాక్ట్ కాంక్రీటు (RCC)తో నిర్మించబడింది.
అయోధ్య రామ మందిరాన్ని మూడు అంతస్తుల్లో నిర్మించగా ఒక్కో అంతస్తు 20అడుగుల ఎత్తు ఉంది. ఇది కృత్రిమ శిలలా తయారవుతుంది. ఆలయ నిర్మాణంలో ఎక్కడా ఇనుము వాడలేదు. ఆలయంలో మొత్తం 44 తలుపులు, 392 స్తంభాలు రాంలాలా కోసం గొప్ప శ్రీ రామ జన్మభూమి ఆలయం సంప్రదాయ నగర శైలిలో నిర్మించారు.
దీని పొడవు (తూర్పు-పడమర) 380 అడుగులు; వెడల్పు 250 అడుగులు, ఎత్తు 161 అడుగులు. ఆలయ స్తంభాలు, గోడలపై హిందూ దేవుళ్ళ, దేవతల చిత్రాలు చెక్కబడ్డాయి. శ్రీ రాముని చిన్ననాటి రూపం (బాల రాముడి విగ్రహం) గ్రౌండ్ ఫ్లోర్‌లోని ప్రధాన గర్భగుడిలో ప్రతిష్ఠించనున్నారు. రామ మందిరం ప్రధాన ద్వారం తూర్పు దిశలో ఉంది. 32మెట్లు ఎక్కి ఇక్కడికి చేరుకోవచ్చు.
ఆలయంలో మొత్తం ఐదు హాళ్లు ఉన్నాయి. రామ మందిరానికి సమీపంలో ఒక బావి (సీతా కూప) ఉంది. ఇది పురాతన కాలం నాటిది. ఆలయ సముదాయం నైరుతి భాగంలోని కుబేర్ తిల వద్ద, జటాయువు విగ్రహంతో పాటు పురాతన శివుని ఆలయం పునరుద్ధరించబడింది. అదేవిధంగా నృత్య మండపం, రంగ మండపం, సభా మండపం, ప్రార్థన మండపంచ, కీర్తన మండపాలు, గ్రానైట్‌తో 21 అడుగుల ఎత్తైన ప్లాట్‌ఫారమ్ నిర్మించారు.