Telugu News » Ramagundam : మెడికల్ కళాశాల ర్యాగింగ్ పై కవిత కీలక వ్యాఖ్యలు.. మండలి చైర్మన్‌కు లేఖ..!

Ramagundam : మెడికల్ కళాశాల ర్యాగింగ్ పై కవిత కీలక వ్యాఖ్యలు.. మండలి చైర్మన్‌కు లేఖ..!

ఈ నేపథ్యంలో నలుగురు విద్యార్థులపై పోలీసు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు వైస్ ప్రిన్సిపాల్ ఛాంబర్ ఎదట ఆందోళనకు దిగారు.

by Venu
mlc kavitha said that local body elections should be held only after the caste census

రామగుండం (Ramagundam) మెడికల్ కళాశాల (Medical College)లో ర్యాగింగ్ (Ragging) భూతం కోరలు విప్పింది. ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న జూనియర్ విద్యార్థులకు.. కొందరు సీనియర్ విద్యార్థులు అమానుషంగా గుండు కొట్టించి.. ట్రిమ్మర్‌తో బలవంతంగా మీసాలను తీసేశారు. జూనియర్ విద్యార్థులు ఎంతగా ప్రాధేయపడినా సీనియర్లు వినలేదని బాధిత విద్యార్థులు వాపోయారు. ఈ మేరకు విద్యార్థుల తల్లిదండ్రులు గోదావరి ఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

bjps agenda is complete brs leader kavitha

ఈ నేపథ్యంలో నలుగురు విద్యార్థులపై పోలీసు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు వైస్ ప్రిన్సిపాల్ ఛాంబర్ ఎదట ఆందోళనకు దిగారు. ర్యాగింగ్‌కు పాల్పడిన సీనియర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇకపోతే రామగుండం మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌ ఘటనపై నిజామాబాద్‌ (Nizamabad) ఎమ్మెల్సీ కవిత (Kavitha) ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ అంశంపై శాసనమండలిలో చర్చించాలని కోరుతూ మండలి చైర్మన్‌కు లేఖ రాశారు. ర్యాగింగ్‌ అనేది అమానవీయమని, మానవ హక్కుల ఉల్లంఘన అని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనల పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించాలని లేఖలో డిమాండ్ చేశారు. కాగా ఇదివరలో ర్యాగింగ్ వల్ల ఎందరో విద్యార్థులు బలైన ఘటనలు తెలిసిందే..

You may also like

Leave a Comment