వైఎస్ షర్మిల (YS Sharmila) కాంగ్రెస్ (Congress) పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారనే వార్తలపై, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. షర్మిల రాకతో కాంగ్రెస్ తో పాటు ఇండియా కూటమికి సైతం ప్రయోజనమే అని తెలిపారు. అయితే వైసీపీ వీడాలనుకునే వారికి షర్మిల ద్వారా అవకాశం దొరికినట్టే అన్నారు.. కాంగ్రెస్ లోకి షర్మిల రాగానే వెంటనే అన్నీ జరగబోవని మ్యాటర్ సస్పెన్స్ లో పెట్టారు..
పార్లమెంట్ ఎన్నికల్లో మా వ్యూహాలు మాకుంటాయని తెలిపిన రామకృష్ణ (Ramakrishna).. ఫిబ్రవరి నెలాఖరులో కాంగ్రెస్ తో ఎత్తులు, పొత్తుల విషయాలు తేలుతాయన్నారు. బీజేపీ (BJP) వ్యతిరేక పార్టీ అని ఆరోపించిన ఆయన.. కాంగ్రెస్, వామపక్షాలు అని స్పష్టం చేశారు. స్వయంగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలే లిక్కర్ స్కాం ఇక్కడ జరుగుతోందని లెటర్ ఇచ్చినా, ప్రొసీడ్ కాలేదని ఆరోపించిన రామకృష్ణ.. ప్రధాని మోడీ బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
కిందిస్ధాయి ఉద్యోగులు జీతాల కోసం రోడ్లెక్కే పరిస్ధితి ఏపీలో నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. బతుకు దెరువు కోసం 1.06 లక్షల అంగన్వాడీ వర్కర్ల చేస్తున్న ధర్నాను తప్పుదారి పట్టిస్తున్నారని.. రాష్ట్ర వ్యాప్తంగా రేపు జరగబోయే కలెక్టరేట్ల దిగ్బంధన కార్యక్రమానికి, సీపీఐ మద్దతిచ్చి పాల్గొంటుందని రామకృష్ణ ప్రకటించారు. ఇప్పటి వరకు 11 లక్షల కోట్ల అప్పులు చేశారు.. మరో 2 వేల కోట్ల అప్పు అంగన్వాడీ వర్కర్ల కోసం చేస్తే ఏమైనా పోతుందా? అని ప్రశ్నించారు.
మరోవైపు బైజూస్ రూ.9200 కోట్ల మనీలాండరింగ్ లో ఉన్న కంపెనీ.. అయినా బజాజ్ ఫైనాన్స్ తో టైఅప్ చేసుకుని విద్యార్ధులను దోచుకుంటోందని రామకృష్ణ ఆరోపణలు చేశారు.. ఇకపోతే షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరటమే కాకుండా.. ఏకంగా పార్టీని విలీనం చేస్తున్నట్లు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. 4వ తేదీన ఢిల్లీలో.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.