Telugu News » RamCharan : శ్రీవారి సుప్రభాత సేవలో రాంచరణ్ దంపతులు.. ఫ్యాన్స్‌ కోసం బర్త్ డే కానుక రిలీజ్!

RamCharan : శ్రీవారి సుప్రభాత సేవలో రాంచరణ్ దంపతులు.. ఫ్యాన్స్‌ కోసం బర్త్ డే కానుక రిలీజ్!

మెగా పవర్‌స్టార్ రాంచరణ్ (Ramcharan Couple) సతీసమేతంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి(Venkateshwara swami) వారిని బుధవారం ఉదయం సందర్శించుకున్నారు. వేకువజామున శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించిన రాంచరణ్ దంపతులు కుటుంబ సమేతంగా సుప్రభాత సేవ(Suprabatha Seva)లో పాల్గొన్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని మొక్కులు సమర్పించుకున్నారు.

by Sai
Ramcharan couple in Srivari Suprabhata Seva.. Birthday gift release for fans!

స్వామి వారి దర్శనం పూర్తయ్యాక మండపంలో రాంచరణ్ ఉపాసన దంపతులను ఆలయ అర్చకులు ఆశీర్వదించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం చెర్రీ దంపతులు మండపం నుంచి బయటకు రాగా అభిమానులు చెర్రీని చూసేందుకు ఎగబడ్డారు. ఈ నేపథ్యంలోనే అభిమానుల తాకిడి నుంచి తప్పించుకునేందుకు రాంచరణ్, ఉపాసన బ్యాటరీ వెహికిల్‌‌లో కొద్ది దూరం ప్రయాణించారు. వీరితో పాటు మెగాస్టార్ ముద్దుల మనవరాలు, రాంచరణ్ దంపతుల కూతురు క్లింకార(Clinkara) కూడా ఉంది.

ఇన్నిరోజులు పాప ఫేస్ కనిపించకుండా చెర్రీ దంపతులు జాగ్రత్త పడుతూ వచ్చారు. కానీ శ్రీవారి సుప్రభాత సేవకు వచ్చిన సమయంలో పాప ఫేస్‌ను అక్కడి కెమెరామెన్‌లు క్లిక్ మనిపించారు.

కాగా, రాంచరణ్ పుట్టినరోజు(Charan Birthday) సందర్భంగా స్వామివారి దర్శనం కోసం కుటంబసమేతంగా వచ్చినట్లు తెలుస్తోంది.చెర్రీ (27-03-1985)లో జన్మించారు. నేటితో రాంచరణ్ 39వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. తమ అభిమాన నటుడి బర్త్ డేను మెగా అభిమానులు గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారు. పలుచోట్ల రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. ఇక శంకర్ దర్శకత్వంలో వస్తున్న ‘గేమ్ ఛేంజర్’ మూవీ సాంగ్ చెర్రీ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేశారు.

You may also like

Leave a Comment