Telugu News » Ramilla Radhika : సుమన్ భరతం పడతాం!

Ramilla Radhika : సుమన్ భరతం పడతాం!

రబ్బరు చెప్పులతో తిరిగి పక్కవాడిని పైసలు అడిగి బతికిన వ్యక్తికి ఈరోజు వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని బాల్క సుమన్ ను ఉద్దేశించి విమర్శించారు రాధిక.

by admin
ramilla radhika fire on balka suman

బీఆర్ఎస్ తరఫున టికెట్ దక్కిన సిట్టింగుల్లో బాల్క సుమన్ (Suman) ఒకరు. ఎన్ని విమర్శలు వచ్చినా సరే.. చాలామంది లీడర్లను మార్చలేదు కేసీఆర్ (KCR). ఈ నేపథ్యంలో విపక్ష నేతలు కేసీఆర్ ను టార్గెట్ చేస్తున్నారు. ఎమ్మెల్యేల బాగోతాలను బయటపెడుతున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ వ్యవహారాలన్నీ బట్టబయలు చేస్తామని చెన్నూరు కాంగ్రెస్ నాయకురాలు రామిళ్ల రాధిక (Ramilla Radhika) స్పష్టం చేశారు.

 

ramilla radhika fire on balka suman

మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. శత్రువు ఎవరో తెలిసిన తర్వాత యుద్ధం చేయడం చాలా సులువుగా ఉంటుందని అన్నారు. ఇప్పుడు తన శత్రువు ఎవరో తెలిసిపోయిందని.. ఇక యుద్ధం మాత్రమే మిగిలి ఉందని చెప్పారు. ఇది యుద్ధం కూడా కాదు దండయాత్ర అని తెలిపారు. చెన్నూరు గడ్డపై బాల్క సుమన్ మీద దండయాత్ర చేసేందుకు సమరోత్సాహంతో ముందుకెళ్తున్నానని స్పష్టం చేశారు.

స్థానిక ప్రజల్ని పట్టి పీడించే ఒక జలగ బానిస సుమన్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు రాధిక. జగడమే ఆలంబనగా పోరాడుతున్న ఆడబిడ్డనని.. జై తెలంగాణ నినాదంతో నై తెలంగాణ పనులు చేస్తున్న వ్యక్తిపై పోరాటం చేసేందుకు ఉద్యమిస్తున్నానని అన్నారు. కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా తన తండ్రి రాజలింగం పోరాడారని.. ఆయన అడుగు జాడల్లోనే ముందుకు వెళ్తున్నానని తెలిపారు.

రబ్బరు చెప్పులతో తిరిగి పక్కవాడిని పైసలు అడిగి బతికిన వ్యక్తికి ఈరోజు వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని బాల్క సుమన్ ను ఉద్దేశించి విమర్శించారు రాధిక. అక్రమంగా సహజ వనరులు అమ్ముకోవడం కూడా ఓ బతుకేనా.. ఇలాంటి వ్యక్తిని వచ్చే ఎన్నికల్లో చిత్తుగా ఓడించాల్సిన అవసరం ఉందని ప్రజలను కోరారు రామిళ్ల రాధిక.

You may also like

Leave a Comment