Telugu News » Sivathmika new Tamil movie : శివాత్మిక ఇక నుంచి చెన్నై దొరసాని.. 3తమిళ్ మూవీస్ తో బిజీ..!

Sivathmika new Tamil movie : శివాత్మిక ఇక నుంచి చెన్నై దొరసాని.. 3తమిళ్ మూవీస్ తో బిజీ..!

శివాత్మిక...తల్లిదండ్రుల నటవారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న తెలుగమ్మాయి.దొరసాని సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి సెల్ఫ్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది.

by sai krishna

శివాత్మిక…తల్లిదండ్రుల నటవారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న తెలుగమ్మాయి.దొరసాని సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి సెల్ఫ్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది. తనది హీరోయిన్ ఫేస్ కాదంటూ ట్రోల్ చేసిన వాళ్లకి అంతే హుందాగా బదులిచ్చింది.

విశాల్ వెంకట్(Vishal Venkat)దర్శకత్వంలో ఓ సరికొత్త సినిమాకి సైన్ చేసింది. గ్రేంబ్రియో పిక్చర్స్(Grambrio Pictures)పతాకంపై సుధాకుమార్ నిర్మిస్తున్న చిత్రంలో అర్జున్ దాస్(Arjun Das)సరసన హీరోయిన్ గా నటిస్తోంది. అర్జున్ దాస్ కమల్ హీరోగా వచ్చిన “విక్రమ్” సినిమాలోని విలన్ రోల్ ప్లే చేశాడు.

ఈ నెల21న చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్స్ లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమయ్యింది. ఇందులో నాజర్‌(Nazar), కాళీ వెంకట్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.చక్కని వినోదంతో కూడిన కమర్షియల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌(Commercial entertainment)డ్రామా అని దర్శకుడు విశాల్ వెంకట్ తెలిపారు.


హీరో అర్జున్ దాస్ మాట్లాడుతూ ఈ చిత్రంలో మంచి విషయం ఉందని, నాజర్‌ లాంటి సీనియర్స్‌తో కలిసి పనిచేయటం సంతోషంగా ఉందని, అలాగే సంగీత దర్శకుడు డి.ఇమాన్‌కు తాను పెద్ద అభిమానినని,ఈ చిత్రానికి ఆయన సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలో తాను నటించడం చాలా ఆనందంగా ఉందని చెప్పుకొచ్చాడు. కాగా తమిళంలో ఇప్పటికే రెండు మూవీస్ చేసిన శివాత్మిక..తెలుగులో కంటే తమిళంలోనే బిజీ అవుతుందా అనిపిస్తుంది.

You may also like

Leave a Comment