బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్‌పై (Ranbir Kapoor) ఇద్దరు లాయర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హిందువుల సెంటిమెటును దెబ్బతీశాడంటూ ఆరోపించారు. క్రిస్మస్ కేక్(Cristmas Cake) కట్‌చేస్తూ.. జైమాతా దీ(Jai Mata di) నినాదం.. చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈనెల 25న కపూర్ ఫ్యామిలీ అంతాకలిసి ముంబైలోని కునాల్ కపూర్ ఇంట్లో క్రిస్మస్ సంబురాలు చేసుకున్నారు. ఈ వేడుకల్లో రణ్‌బీర్ కపూర్‌తోపాటు ఆయన కుటుంబసభ్యులు పాల్గొన్నారు. అయితే, రణ్‌బీర్ కేక్‌పై మద్యాన్ని పోసి నిప్పంటించాడు. అంతేకాకుండా జై మాతా ది అంటూ నినాదం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
ఈ మేరకు తన లాయర్లు ఆశిష్ రాయ్, పంకజ్ మిశ్రాతో కలిసి ముంబైలోని ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రణబీర్ కపూర్ సనాతన ధర్మాన్ని కించపరుస్తూ నినాదాలు చేశారని, తమ మతపరమైన మనోభావాలను దెబ్బతీశారని అందులో పేర్కొన్నారు. అయితే ఇప్పటివరకు ఎఫ్‌ఐఆర్ నమోదుకాలేదు.
హిందూ మతంలో ఇతర దేవతలను పిలిచే ముందు అగ్ని దేవుణ్ణి ఆరాధిస్తారు. అయితే రణబీర్ కపూర్, అతడి కుటుంబ సభ్యులు ఉద్దేశపూర్వకంగానే క్రైస్తవ మతం పండుగ సమయంలో మద్యాన్ని ఉపయోగించారని, జై మాతా ది అనే నినాదాలు చేశారని సంజయ్ తివారీ ఆరోపించారు.