Telugu News » Himaja : రేవ్ పార్టీపై క్లారిటీ ఇచ్చిన నటి..!!

Himaja : రేవ్ పార్టీపై క్లారిటీ ఇచ్చిన నటి..!!

ఈ న్యూస్ పై స్పందించిన నటి హిమజ తన మీద తప్పుడు వార్తలు రావడంపై మండిపడ్డారు. కొత్త ఇంట్లో ఫ్రెండ్స్‌తో కలిసి దీపావళి సెలెబ్రేషన్స్ చేసుకుంటున్నానని, ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి పోలీసులని రప్పించారని తెలిపింది.

by Venu

సోషల్ మీడియా వచ్చాక ఏ వార్త అయినా క్షణాల్లో వైరల్ అవడం నిత్యం చూస్తూనే ఉన్నాం. సెలబ్రిటీల విషయంలో అయితే రాకెట్ కంటే వేగంగా గాసిప్స్ దూసుకు పోతున్నాయి. ప్రస్తుతం ఓ బుల్లితెర నటి విషయంలో జరిగిన సంఘటన తనకు తెలియకుండా.. సోషల్ మీడియా ద్వారా అంతా పాకేసింది. చివరికి ఆ విషయం పై తాను క్లారిటీ ఇచ్చింది. ఇంతకి విషయం ఏంటంటే..

రంగారెడ్డి (Rangareddy) జిల్లా ఇబ్రహీంపట్నం (Ibrahimpatnam) పీఎస్‌ పరిధి జేబీ (JB) వెంచర్‌లో ఉన్న విల్లాలో.. లిక్కర్‌ పార్టీ జరుగుతుందన్న సమాచారం రావడంతో.. మహేశ్వరం ఎస్‌వోటీ పోలీసులు అక్కడికి వెళ్లారు. ఆ విల్లా బిగ్‌బాస్‌ (Bigboss) కంటెస్టెంట్‌, నటి హిమజదని (Himaja) గుర్తించిన పోలీసులు.. అక్కడ 15 లీటర్ల లిక్కర్‌, డీజే సిస్టమ్‌ను స్వాధీనం చేసుకుని ఆ పార్టీలో ఉన్న వారిని అరెస్ట్ చేసినట్టు వార్తలు వచ్చాయి.

అయితే ఈ న్యూస్ పై స్పందించిన నటి హిమజ తన మీద తప్పుడు వార్తలు రావడంపై మండిపడ్డారు. కొత్త ఇంట్లో ఫ్రెండ్స్‌తో కలిసి దీపావళి సెలెబ్రేషన్స్ చేసుకుంటున్నానని, ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి పోలీసులని రప్పించారని తెలిపింది. పోలీసులు వచ్చి తమ డ్యూటీ తాము చేసుకుని వెళ్లారని హిమజ వెల్లడించింది.

కానీ మీడియాలో మాత్రం వేరే విధంగా ప్రచారం జరిగిందని హిమజ మండిపడ్డారు. పండుగ రోజు ఇంట్లో రేవ్ పార్టీ చేసుకుంటారా?.. పూజ చేసుకుంటుంటే ఇలా జరిగిందంటూ ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో పోస్టు చేశారు నటి హిమజ..

You may also like

Leave a Comment