Telugu News » Ratan Tata: ర‌త‌న్ టాటాకు బెదిరింపు కాల్.. ఎవరు చేశారో గుర్తించిన పోలీసులు..!

Ratan Tata: ర‌త‌న్ టాటాకు బెదిరింపు కాల్.. ఎవరు చేశారో గుర్తించిన పోలీసులు..!

ఆ బెదిరింపు కాల్ చేసింది విద్యార్థి అని తేల్చారు. అయితే ఆ వ్యక్తి మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. పూణెలోని ఇంట్లో నుంచి ప‌రారై కర్ణాటక నుంచి బెదిరింపు కాల్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

by Mano
Ratan Tata: Threatening call to Ratan Tata.. Police identified who made it..!

ప్రముఖ వ్యాపార‌వేత్త ర‌త‌న్ టాటా(Ratan Tata)ను బెదిరించిన వ్య‌క్తిని ముంబై పోలీసులు (Mumbai Police) ఎట్టకేలకు గుర్తించారు. ఆ బెదిరింపు కాల్ చేసింది విద్యార్థి అని తేల్చారు. అయితే ఆ వ్యక్తి మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. పూణెలోని ఇంట్లో నుంచి ప‌రారై కర్ణాటక నుంచి బెదిరింపు కాల్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

Ratan Tata: Threatening call to Ratan Tata.. Police identified who made it..!

వివ‌రాళ్లోకి వెళ్తే.. ర‌త‌న్ టాటాకు సెక్యూరిటీని పెంచాల‌ని ఓ వ్య‌క్తి ముంబై పోలీసుల‌కు ఫోన్ చేశాడు. సెక్యూరిటీని పెంచ‌కుంటే టాటా స‌న్స్ మాజీ చైర్మన్ సైర‌స్ మిస్త్రీ త‌ర‌హాలో ర‌త‌న్ టాటాకు ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఫోన్‌లో హెచ్చరించాడు. ఆ ఫోన్ కాల్‌తో ముంబై పోలీసులు అల‌ర్ట్ అయ్యారు. ర‌త‌న్ టాటాకు ప్ర‌త్యేక సెక్యూర్టీని ఏర్పాటు చేశారు.

అయితే సాంకేతిక బృందం సాయంతో ఆ వ్యక్తి ఎక్కడి నుంచి ఆ కాల్ చేశాడో లొకేషన్‌ను ట్రేస్ చేశారు పోలీసులు. ఈ మేరకు అతడు పూణెకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అయితే అత‌ను పూణెకు చెందిన వ్య‌క్తి అని తేల్చారు. పూణెలో అత‌డి ఇంటికి వెళ్లి ఆరా తీసిన పోలీసులు అత‌డు ఐదు రోజుల నుంచి అదృశ్యమయ్యాడని గుర్తించారు. ఈ మేరకు అక్కడి బోసారి పోలీసు స్టేష‌న్‌లో కేసు ఫైల్ చేశారు.

రతన్ టాటాను బెదిరించిన వ్యక్తి ఎంబీఏ, ఇంజినీరింగ్ చదువుకున్నట్లు సమాచారం. అయితే అతడు సిజోఫ్రేనియా అనే మాన‌సిక వ్యాధితో బాధ‌ప‌డుతున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆ వ్య‌క్తి ఇంట్లోనే మ‌రో వ్య‌క్తికి చెందిన ఫోన్‌ను తీసుకెళ్లాడు. ఆ ఫోన్‌తోనే ముంబై పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి.. ర‌త‌న్ టాటాను బెదిరించినట్లు తెలుస్తోంది.

You may also like

Leave a Comment