నోయిడా(Noida)లోని సెక్టార్ 49లో జరుగుతున్న ఓ రేవ్ పార్టీ(Rave Party(పై పోలీసులు గురువారం రాత్రి దాడి చేశారు. ఈ సందర్భంగా ఐదుగురు వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. బిగ్‌బాస్ ఓటీటీ(హిందీ) సీజన్-2(Bigg boss OTT Hindi Season-2) విజేత, ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ ఎల్విష్ యాదవ్ (Elvish Yadav) పేరును కూడా ఎఫ్ఎస్ఐఆర్‌లో చేర్చారు. ఈ విషయాన్ని పోలీసులు వెల్లడించారు.
కొన్ని పాములను స్వాధీనం చేసుకోగా వాటిల్లో ఐదు త్రాచులు, ఒక కొండ చిలువ, రెండుతలల పాము, ర్యాట్ స్నేక్ ఉన్నాయి. వీటితోపాటు పార్టీలో 20 ఎంఎల్ పాము విషాన్ని కూడా గుర్తించి సీజ్ చేశారు. ఎల్విష్ ఒక పామును చేత్తో పట్టుకొని అడుతున్న వీడియో బయటకు రావడంతో అతడిపై కేసు పెట్టినట్లు పోలీసులు చెప్పారు. ఈ దాడి సందర్భంగా అరెస్టు చేసిన వారిని ప్రశ్నించగా ఎల్విష్ పేరు బయటకు వచ్చింది.
ఎల్విష్ నిర్వహించే పార్టీలకు తరచూ పాములను సరఫరా చేస్తుంటామని వారు వెల్లడించారు. ఇందుకోసం భారీ మొత్తంలో డబ్బు తీసుకుంటామని అంగీకరించారు. ఈ దాడుల్లో మాదకద్రవ్యాల నిరోధక శాఖ, అటవీ శాఖ, నోయిడా పోలీసులు పాల్గొన్నారు. కేసు నమోదు చేసిన విషయం బయటకు రాగానే ఎల్విష్ పరారైనట్లు తెలిపారు.
ఎల్విష్ కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మరోవైపు ఈ కేసుపై దిల్లీ మహిళా కమిషన్ ఛైర్మన్ స్వాతీ మాలీవాల్ స్పందించారు. ఎల్విష్‌తో కలిసి హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ దిగిన ఫొటోలను పోలీసులు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. ‘ఎల్విష్ పై ఎఫ్ఎస్ఐఆర్ నమోదైందని ఇప్పుడే తెలిసింది. అతడు రేవ్ పార్టీలు నిర్వహిస్తుంటాడని, పాము విషం, మత్తు వాటిల్లో పోలీసులు ఆరోపించారు. ఇలాంటి వ్యక్తిని సీఎం వేదికపై ప్రమోట్ చేశారు’ అంటూ స్వాతీ మాలీవాల్ ఆరోపణలు చేశారు.