పీఎల్(IPL) చరిత్రలో రవీంద్ర జడేజా(ravindra jadeja) అరుదైన రికార్డును సృష్టించాడు. 100 క్యాచ్‌లు(100 catches) పట్టిన 5వ క్రికెటర్‌గా రవీంద్ర జడేజా ఘనతను సాధించాడు. దీంతో ఐపీఎల్లో 100 క్యాచ్‌లతో పాటు 100 వికెట్లు, 1000 పరుగులు చేసిన ఏకైక క్రికెటర్‌గా జడేజా రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్ 2024(IPL-2024)లో చెన్నై సూపర్ కింగ్స్(CSK), కోల్‌కతా నైట్ రైడర్స్(KKR)తో జరిగిన 22వ మ్యాచ్‌లో జడ్డూ ఈ ఘనతను సాధించాడు.
మరోవైపు ఐపీఎల్లో 1000+ పరుగులు, 100+ వికెట్లు, 100+ క్యాచ్‌లు అందుకున్న ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా రవీంద్ర జడేజా నిలిచాడు. ఈ స్టార్ బౌలర్ 2008 నుంచి ఐపీఎల్లో మొదటి సీజన్లో ఆడుతున్నాడు. ఇప్పటి వరకు 231 మ్యాచ్‌ల్లో బ్యాట్స్‌మెన్‌గా 2,776 పరుగులు తీశాడు. బౌలర్‌గా ఇప్పటి వరకు 156 వికెట్లు తీశాడు. ఐపీఎల్ చరిత్రలో 2వేల కంటే ఎక్కువ పరుగులు, 150 కంటే ఎక్కువ వికెట్లు తీసిన మొదటి ఆటగాడు కూడా జడేజా కావడం విశేషం.
ఇక ఇటీవలి మ్యాచ్‌లో ఈ స్టార్ బౌలర్ తన అద్భుతమైన బౌలింగ్‌తో ప్రత్యర్థులకు చెమటలు పట్టించాడు. 4 ఓవర్లలో 18 పరుగులిచ్చి ముగ్గురు కోల్‌కతా బ్యాట్స్మెన్లను ఔట్ చేశాడు. సునీల్ నారాయణ్, రఘువంశీ, వెంకటేష్ అయ్యర్‌లను జడేజా పెవిలియన్‌కు పంపించాడు. ముస్తాఫిజుర్ రెహమాన్ బంతికి కోల్‌కతా కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ అద్భుత క్యాచ్ జడేజా పట్టడంతో 100 క్యాచ్‌ల రికార్డు జడేజా అందుకున్నాడు.
దీంతో ఐపీఎల్లో 100 క్యాచ్‌లు పట్టిన నాల్గవ భారతీయుడు కాగా, ప్రపంచంలో ఐదో ఆటగాడిగా జడేజా నిలిచాడు. ఇంతకు ముందు విరాట్ కోహ్లీ, సురేశ్ రైనా, కీరన్ పొలార్డ్, రోహిత్ శర్మలు ఈ ఘనతను సాధించారు. ఇప్పటి వరకు ఈ ఘనతను సాధించిన లిస్టులో విరాట్ కోహ్లీ 110, సురేష్ రైనా 109, కీరన్ పొలార్డ్ 103, రోహిత్ శర్మ 100, శిఖర్ ధావన్ 98 ఉన్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి జడేజా వచ్చి చేరాడు.