వారం రోజులుగా విదేశీ మారకద్రవ్య నిల్వలు(Foreign exchange reserves) తగ్గుముఖం పట్టాయి. అయినా భారత్(Bharath) ఖజానాలో విపరీతమైన పెరుగుదల కనిపించింది. 10 నుంచి 11 నెలల్లో రూ.4లక్షల కోట్లకు పైగా విదేశీ మారక నిల్వలు పెరిగాయి. రానున్న రోజుల్లో ఈ నిల్వలు పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దేశ విదేశీ మారకద్రవ్య నిల్వలు 28 బిలియన్ డాలర్లు తక్కువగానే ఉన్నాయి.
భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విదేశీ మారకద్రవ్య నిల్వలో విపరీతమైన పెరుగుదల ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) శుక్రవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విదేశీ మారక నిల్వలు 50.28 బిలియన్ డాలర్లు పెరిగాయి. పాకిస్థాన్ వద్ద మొత్తం 13 బిలియన్ డాలర్ల విదేశీ మారకద్రవ్య నిల్వలు ఉన్నాయి. భారత్ విదేశీ మారకద్రవ్య నిల్వలు ఎంత బలపడ్డాయో ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు.
రిజర్వ్ బ్యాంక్ డేటా ప్రకారం, కరెన్సీ నిల్వల్లో ముఖ్యమైన భాగంగా పరిగణించబడే విదేశీ కరెన్సీ ఆస్తులు ఫిబ్రవరి 2తో ముగిసిన వారంలో 4.07 బిలియన్ డాలర్లు తగ్గి 546.52 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. దీంతో ఈ ఏడాది ఇప్పటివరకు రూపాయి అత్యుత్తమ ఆసియా కరెన్సీగా నిలిచింది. మొత్తం నిల్వలలో క్షీణత విదేశీ కరెన్సీ ఆస్తులలో పదునైన క్షీణత కారణంగా ఉంది.
ఫిబ్రవరి 9తో ముగిసిన వారంలో దేశ విదేశీ మారకద్రవ్య నిల్వలు క్షీణించాయి. ఈ తగ్గుదల 5.24 బిలియన్ డాలర్లు అంటే రూ.43వేల కోట్లకు చేరుకుంది. ఆ తర్వాత దేశ విదేశీ మారకద్రవ్య నిల్వలు 617.23 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. దీనికి వారం ముందు మొత్తం విదేశీ మారకద్రవ్య నిల్వలు 622.5 బిలియన్ డాలర్లు. 2021 అక్టోబర్‌లో దేశ విదేశీ మారక నిల్వలు జీవితకాల గరిష్ఠ స్థాయి 645 బిలియన్ డాలర్లకు చేరాయి.