ఆకాశదీపం, ఆకాశదీపం అంటారు. అసలు ఆకాశదీపం అంటే ఏంటి..? అనే సందేహం మీకు ఎప్పుడైనా వచ్చిందా..? ఈ సందేహం ఉన్నట్టు అయితే ఇప్పుడే క్లియర్ చేసుకోండి. శివుడికి కార్తీక మాసం అంటే ఎంతో ఇష్టం ఈ మాసంలో ఆలయాలలో ధ్వజస్తంభానికి ఆకాశదీపాన్ని వేలాడదీస్తూ ఉంటారు. చిన్నచిన్న రంధ్రాలు చేయబడిన ఒక గుండ్రని ఇత్తడి పాత్రలో నూనె పోసి ఈ దీపాన్ని వెలిగించడం జరుగుతుంది.
ఆకాశదీపం పితృ దేవతలకు మార్గాన్ని చూపుతోందని పురాణాలు అంటున్నాయి. తాడు సహాయంతో ఈ పాత్రను పైకి పంపించి ధ్వజస్తంభంపై వేలాడ తీస్తారు. ఆకాశదీపం అని ఎందుకు పిలుస్తారు అనేది చూస్తే… ఆకాశ మార్గాన ప్రయాణించే పితృదేవతల కోసమని కార్తీక పురాణం అంటోంది. కార్తీక మాసంలో పితృదేవతలంతా ఆకాశమార్గాన తమ లోకాలకి ప్రయాణం చేస్తూ ఉంటారు.
Also read:
ఈ టైం లో వారికి త్రోవ సరిగా కనపడటం కోసం, దేవాలయాలలో ఆకాశదీపాన్ని వెలిగించడం జరుగుతుంది. శివ కేశవుల తేజస్సుని జగత్తుకి అందిస్తుంది. ఆకాశదీపం వెనుక ఉన్న మరో ఉద్దేశం ఏంటంటే, దీపం ధ్వజస్తంభం పై నుండి జగత్తుకి వెళ్తూ ఇస్తుందని. ఒక్కో చోట రెండు దీపాలని శివకేశవులు పేరుతో వెలిగిస్తారు. కార్తీక మాసం ఆకాశదీపం తోనే మొదలవుతుంది. ఈ దీపంలో నూనె పోసినా లేదంటే నమస్కరించుకున్నా పుణ్య ప్రాప్తి లభిస్తుంది. ఇది ఆకాశదీపం వెనుక ఉన్న అర్థం. ఆకాశ దీపాన్ని వెలిగించడానికి కారణం.