పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలోని ప్రధాన పార్టీలు తమ ప్రచారాలతో హోరెత్తిస్తున్నాయి.ఈ క్రమంలోనే మంగళవారం హనుమాన్ జయంతి(Hanumana Jayanthi)ని పురస్కరించుకుని హైదరాబాద్లో నిర్వహించిన శోభాయాత్రలో బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత(Bjp Mp Candidate Madavilatha) పాల్గొన్నారు. అంతకుముందు ఎన్నికల కోడ్ (election code Violation) ఉల్లంఘన నేపథ్యంలో ఆమెపై పోలీసులు క్రిమినల్ కేసు ఫైల్ చేశారు.
ఈ సందర్బంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తనపై నమోదైన క్రిమినల్ కేసుపై స్పందించారు. ‘నేను ఎలాంటి తప్పు చేయకున్నా నాపై కేసు పెట్టారు.తొలిసారి నాపై ఎఫ్ఐఆర్ నమోదైంది. దీనిని గొప్పగా భావిస్తున్నానని’ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘రాముడి బాణంపై కేసు వేశారని’ అనుకుంటున్నట్లు చెప్పారు. కాగా, ఈనెల 17న శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న
మాధవీలత.. మసీదుపైకి బాణం ఎక్కుపెట్టినట్లుగా ఫోజు ఇచ్చారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.
ఈ క్రమంలోనే ఆమె ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు అందడంతో పోలీసులు మాధవీలతపై క్రమినల్ కేసు నమోదు చేశారు.