ఏపీ (AP) రాజకీయాలను స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ (Skill Development Scam) ఓ కుదుపు కుదుపుతోన్న సంగతి తెలిసిందే.. అసలే ఎన్నికల ప్రచారం నిర్వహించవలసిన సమయంలో.. ఈ కేసులో అరెస్టైన చంద్రబాబు (Chandra Babu) జైల్లో ఉన్నారు. ఆయనను బయటకు తీసుకు రావడానికి బాబు తరపున లాయర్లు చేయని ప్రయత్నం లేదని తెలుస్తోంది.
ఇక బాబు కేసు వాయిదాల మీద వాయిదాలు పడుతోన్న విషయం తెలిసిందే.. కాగా టీడీపీ (TDP) అధినేత చంద్రబాబుకు ఏపీ ఫైబర్ నెట్ కేసులో ఊరట లభించింది. తదుపరి విచారణను నవంబర్ 9కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు.. ఈ కేసులో నవంబర్ వరకు చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయోద్దని ఆదేశించింది. ఈ మేరకు దిగువ కోర్టులకు ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది.
మరోవైపు ఏపీ ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ఈ పిటిషన్ విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు.. నేడు వాదనలు వినిపించింది. జస్టిస్ అనిరుద్ధ బోస్.. జస్టిస్ ఎం బేలా త్రివేది ధర్మాసనం విచారణ జరిపింది. సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా.. బాబు తరఫున వాదనలు వినిపించారు. చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్‌పై తీర్పు వెల్లడించాల్సి ఉందని సిద్ధార్థ లూథ్రా వాదించారు. ఇరు వాదనలు విన్న సుప్రీంకోర్టు క్వాష్ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్ చేసినట్టు తెలిపింది.