సీఎం కేసీఆర్ (CM KCR) కు టీపీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు పెంచేందుకు, వారికి పౌష్టికాహారం అందించేందుకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశ పెట్టారని అన్నారు. ఇప్పటికే మధ్యాహ్న భోజన పథకంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని చెప్పారు. వాటన్నింటినీ పట్టించుకోకుండా ఇప్పుడు సీఎం బ్రేక్ ఫాస్ట్ అంటూ ప్రభుత్వం హడావుడి చేస్తోందని ఆయన తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.
ఓ వైపు మార్కెట్ ధరలు భగ్గుమంటున్నాయని, కానీ ఇప్పటికీ ఆ ధరలకు అనుగుణంగా రాష్ట ప్రభుత్వం బడ్జెట్ పెంచడం లేదంటూ ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ధరలను సవరించక పోగా ఇప్పుడు మధ్యాహ్న భోజనం మెనూలో మార్పులు చేశారని అన్నారు. దీంతో వంట కార్మికులకు ఆర్థిక భారత పెరుగుతోందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
చాలా వరకు పాఠశాలల్లో వంట గదులే సక్రమంగా లేవన్ోనారు. చాలా చోట్ల శిథిలావస్థకు చేరాయన్నారు. దీంతో చాలా చోట్ల ఆరు బయట, కింద చెట్ల కింద కార్మికులు వంటలు కొనసాగిస్తున్నారని అన్నారు. దీంతో చాలా భోజనం కలుషితం అవుతుందని, చాలా చోట్ల అస్వస్థతకు గురైన ఘటనలు గతంలో చాలా జరిగాయన్నారు. భోజనాల కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్నారని అన్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోవడం లేదన్నాురు.
మధ్యాహ్న భోజన కార్మికులకు పెంచిన జీతాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నూతన మెనూకు బడ్జెట్ పెంచాలని కోరారు. జీవో 8 ప్రకారం పెరిగిన వేతనాలను ఎరియర్స్‌తో సహా వెంటనే చెల్లించాలని కోరారు. కార్మికులకు ఐడీ కార్డులు, యూనిఫాం ఇవ్వాలని, నిత్యావసర వస్తువులను ప్రభుత్వమే ఉచితంగా పంపిణీ చేయాలని కోరారు.
మెనూ ప్రకారం ఎక్కడా భోజనాలు వడ్డించడం లేదన్నారు. భోజనాల విషయంలో నాణ్యత ప్రమాణాలను పాటించడం లేదన్నారు. నాణ్యమైన ఆహారం అందించాలంటూ గతంలో పలు మార్లు విద్యార్థులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారని గుర్తు చేశారు. ఇప్పటికే అమలవుతున్న మధ్యాహ్నం భోజన పథకాన్ని సరిగ్గా అమలు చేయడం లేదన్నారు. ఇప్పుడు సీఎం బ్రేక్ ఫాస్ట్ అంటూ ప్రచార ఆర్భాటానికి పాల్పడుతూ రాజకీయాలు చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.