తెలంగాణ (Telangana) ముద్దుబిడ్డ.. బాక్సర్ నిఖత్ జరీన్ (Boxer Nikhat Zareen)కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.2 కోట్ల ఆర్థిక సహాయం ప్రకటించారు. అసెంబ్లీ ప్రాంగణంలో మంత్రులు, ఎమ్మెల్యేల సమక్షంలో నిఖత్‌కు ఈ చెక్ అందజేశారు. కాగా బాక్సర్ నిఖత్ జరీన్ ఇప్పటికే రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. మరోవైపు పారిస్‌లో జరిగే ఒలింపిక్స్ కోసం సిద్దం అవ్వడానికి సీఎం రేవంత్ రెడ్డి ఈ మొత్తాన్ని అందజేశారు.
భవిష్యత్‌లో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆకాక్షించారు. మరోవైపు నిఖత్ జరీన్ ఇటీవల నిర్వహించిన మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ 50 కిలోల విభాగంలో పసిడిని కైవసం చేసుకున్నారు. వరుసగా రెండో ఏడాది ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచి అదరగొట్టారు. అంతే కాకుండా నిఖత్ జరీన్ దిగ్గజ మేరీకోమ్ తర్వాత ఒకటి కంటే ఎక్కువసార్లు ప్రపంచ టైటిల్ నెగ్గిన రెండో భారత బాక్సర్ (Indian Boxer)గా చరిత్ర సృష్టించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం అధికారంలో వచ్చిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలలో భాగంగా.. అసెంబ్లీ ఆవరణలో 2 పథకాలను నేడు ప్రారంభించారు. చేయూత, మహాలక్ష్మీ పథకాలను లాంఛ్ చేశారు. ఈ సందర్భంలో బాక్సర్ జరీన్‌కు ఈ ఆర్థిక సహాయం అందజేశారు.
ఇక సాధారణ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన నిఖత్ జరీన్ చిన్నతనం నుంచే బాక్సింగ్‌పై మక్కువ పెంచుకుంది. భారత బాక్సింగ్ కేరాఫ్ నిఖత్ అన్నట్లుగా మారింది. తాజాగా ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించి, ప్రపంచానికి తన సత్తా చాటింది..