కౌన్ బనేగా కరోర్ పతి షో గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అమితాబ్ బచ్చన్ ఎప్పటి నుండో కౌన్ బనేగా కరోర్ పతి షో కి హోస్ట్ గా వుంటున్నారు. ఈ షో విపరీతంగా పాపులర్ అయింది. 24 ఏళ్ల నుండి కూడా సక్సెస్ ఫుల్ గా ఈ షో ని రన్ చేస్తున్నారు. ఈ షో కి బాలీవుడ్ తో పాటుగా దేశ వ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉంది. ఇండియాలో ఆదరణ ఉన్న షోల లో ఈ షో కూడా ఒకటి హిందీ లో స్టార్ట్ అయిన ఈ షో ని దాదాపు అన్ని ప్రాంతీయ భాషల్లో కూడా మొదలు పెట్టారు. తెలుగు లోని మీలో ఎవరు కోటీశ్వరుడు, ఎవరు మీలో కోటీశ్వరుడు అని రెండు పేర్ల తో మూడు నాలుగు సీజన్లు రన్ చేశారు.
Also read:
తెలుగు లో ఈ షో కి ఎన్టీఆర్, నాగార్జున, చిరంజీవి వంటి స్టార్లు హోస్ట్ చేశారు. ఇక ఇది ఇలా ఉంటే హిందీ లో ప్రస్తుతం 15వ సీజన్ నడుస్తోంది. ఈ సీజన్ లో ఒక ఎపిసోడ్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావన వచ్చింది. 40 వేల రూపాయల ప్రశ్నగా రేవంత్ రెడ్డి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అని పార్టిసిపెంట్ ని అమితాబ్ బచ్చన్ ప్రశ్నించారు.
తెలంగాణ, మధ్యప్రదేశ్, ఆంధ్ర ప్రదేశ్ వంటి ఆప్షన్లు ఇచ్చారు. ఆన్సర్ ని మాత్రం కంటెస్టెంట్ చెప్పలేక పోయారు. కన్ఫ్యూజ్ అయిపోయారు. దీంతో లైఫ్ లైన్ ని వాడుకున్నారు. పోల్ తర్వాత 80% మంది ప్రేక్షకులు తెలంగాణ అని 11% మంది చత్తీస్గఢ్ అని సమాధానం ఇచ్చారు. తెలంగాణని లాక్ చేసి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దాంతో ఆమె చెప్పిన ఆన్సర్ కరెక్ట్ అయింది. తెలంగాణలో అధికారం మారిందని తెలంగాణ రెండో ముఖ్యమంత్రి గా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించాలని అమితాబ్ బచ్చన్ ఈ సందర్భంగా చెప్పారు