Telugu News » Revanth Reddy : ఆ విషయంలో బీఆర్ఎస్ కు వార్నింగ్ ఇచ్చిన రేవంత్ ..?

Revanth Reddy : ఆ విషయంలో బీఆర్ఎస్ కు వార్నింగ్ ఇచ్చిన రేవంత్ ..?

ఇసుకలో కట్టిన కాళేశ్వరం.. అణా పైసాకి పనికి రాని మేడిగడ్డ పట్టుకుని తుపాకి రాముడు తిరినట్టు.. ఊరూరా తిరుగుతూ గొప్పలు చెప్పుకుంటున్న బీఆర్ఎస్ ను బొందపెట్టే రోజు దగ్గరలో ఉందని రేవంత్ విమర్శించారు.

by Venu
Revanth Reddy strong counter to ktr over Welfare Schemes dispute

అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Election) ఎనర్జీ అంతా ఉపయోగించి తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తేవాలనే లక్ష్యంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఉన్నారని అంటున్నారు హస్తం కార్యకర్తలు. ఎక్కడ మీటింగ్ జరిగినా.. తనదైన శైలిలో విమర్శలు చేస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్న రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ (BRS)కు వార్నింగ్ ఇచ్చినంత పని చేశారు. మీ అవినీతిని ప్రశ్నిస్తూ.. మీ అసమర్థతను ప్రజల్లోకి తీసుకెళ్తుంటే.. ఆ మీటింగ్ లో కరెంట్ కట్ చేస్తారా అంటూ రేవంత్ మండిపడ్డారు.. మీ నరాలు కట్ అవుతాయని వార్నింగ్ ఇచ్చారు.

tpcc-president-revanth-reddy-fires-on-ktr-and-kcr

 

ఇసుకలో కట్టిన కాళేశ్వరం.. అణా పైసాకి పనికి రాని మేడిగడ్డ పట్టుకుని తుపాకి రాముడు తిరినట్టు.. ఊరూరా తిరుగుతూ గొప్పలు చెప్పుకుంటున్న బీఆర్ఎస్ ను బొందపెట్టే రోజు దగ్గరలో ఉందని రేవంత్ విమర్శించారు. కామపిశాచి దుర్గం చిన్నయ్యకు కబ్జాలు ఆడ పిల్లల తప్పితే ప్రజల కష్టాల పై దృష్టి లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. దుర్గం చిన్నయ్య దుర్మార్గం గురించి ఎవరిని అడిగినా చెబుతారని.. అలాంటి వ్యక్తి టికెట్ ఇవ్వడం సిగ్గుచేటని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి (Revanth Reddy) పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు కాకా వెంకటస్వామి పేరు తెలియని వారు ఉండరని తెలిపిన రేవంత్.. దేశంలో గాంధీ కుటుంబంలా తెలంగాణలో వెంకటస్వామి కుటుంబం కాంగ్రెస్ పార్టీకి పట్టాదారులని ప్రశంసించారు.

దుర్మార్గాల దుర్గం చిన్నయ్య గురించి రాష్ట్రమే కాదు.. దేశమంతా కూడా తెలుసన్న రేవంత్ రెడ్డి.. అలాంటి దుర్మార్గుడిని గెలిపించాలని కేసీఆర్ చెబుతున్నారని మండిపడ్డారు. మరోవైపు చెన్నూరు ఎమ్మెల్యేకు అన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. ఇలాంటి అవినీతి పాలన అంతం చేయాలంటే ఇటు బెల్లంపల్లిలో అటు చెన్నూరులో కాంగ్రెస్ (Congress) జెండా ఎగరేయాలని పిలుపు నిచ్చారు. ఆదిలాబాద్ ఆత్మగౌరవం పెరగాలంటే గడ్డం వినోద్, వివేక్ లను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.

You may also like

Leave a Comment