Telugu News » Revanth : కేసీఆర్ ఏం చేయబోతున్నారో అర్థమైంది!

Revanth : కేసీఆర్ ఏం చేయబోతున్నారో అర్థమైంది!

బీఆర్‌ఎస్ ఎప్పుడూ దిగజారుడు రాజకీయాలే చేస్తుందని మండిపడ్డారు రేవంత్. హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల్లో ఏమైందో ప్రజలు చూశారని.. డబ్బు, మద్యం పంచి ఎన్నికలు గెలవాలని తాము ఎప్పుడూ అనుకోలేదన్నారు.

by admin
Revanth Reddy Controversial Comments On KCR and modi

– డబ్బు, మద్యమే కేసీఆర్ బలం
– అవి లేకుండా ఎన్నికలకు వెళ్లేలా..
– ప్రమాణం చేసేందుకు పిలిస్తే రాలేదు
– పోలీసులను పంపి హడావుడి చేయించారు
– కేసీఆర్, కేటీఆర్ ఉద్యోగం ఊడగొట్టేస్తే..
– ఇందిరమ్మ రాజ్యం సాధించుకుందాం
– నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి పిలుపు

కేసీఆర్ (KCR) ఎన్నికల్లో డబ్బు, మద్యాన్ని నమ్ముకున్నారని క్లారిటీ వచ్చిందన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy). గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. తన సవాల్ ను స్వీకరించకపోవడంతో కేసీఆర్ బుద్ధి అందరికీ అర్థం అయిందన్నారు. డబ్బు, మద్యం పంపిణీ చేసి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు. బీఆర్​ఎస్​ నేతలు నిజంగా ఉద్యమకారులైతే అమరవీరుల స్థూపం వద్ద ప్రమాణం చేద్దామన్న తమ సవాల్​ ను ఎందుకు స్వీకరించలేదని ప్రశ్నించారు.

Revanth Reddy Controversial Comments On KCR and modi

బీఆర్‌ఎస్ (BRS) ఎప్పుడూ దిగజారుడు రాజకీయాలే చేస్తుందని మండిపడ్డారు రేవంత్. హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల్లో ఏమైందో ప్రజలు చూశారని.. డబ్బు, మద్యం పంచి ఎన్నికలు గెలవాలని తాము ఎప్పుడూ అనుకోలేదన్నారు. రేపటి ఎన్నికల్లో సిద్ధాంతాలు ప్రచారం చేసి ఓట్లు అడుగుతామని, మేనిఫెస్టో చూపించి ఓట్లు అడిగేందుకు బీఆర్‌ఎస్ సిద్ధమా? అని సవాల్ విసిరారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేశామని నమ్మితే కేసీఆర్ ప్రమాణం చేయాలన్నారు.

సీఎం చెప్పిన నిధులు, నియామకాలు ఆయన ఇంటికే వెళ్తున్నాయని ఆరోపించారు రేవంత్. ఎక్కడ పైసలు దొరికినా.. కాంగ్రెస్‌ వే అంటూ బురద జల్లుతున్నారని మండిపడ్డారు. అమరవీరుల స్థూపంపై ప్రమాణం చేద్దామని రమ్మంటే.. ముందస్తు అనుమతి పేరుతో పోలీసులు తనను అడ్డుకున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ 6 గ్యారెంటీలు ప్రచారం చేసే ఓట్లు అడుగుతుందని, తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేసేందుకు సీఎం ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

తెలంగాణలో ఉన్న 30 లక్షల మంది నిరుద్యోగులు తలుచుకుంటే ఇందిరమ్మ రాజ్యం వస్తుందని అన్నారు. కేసీఆర్ కుటుంబంలో అందరికీ ఉద్యోగాలు వచ్చాయని, కానీ యువత పరిస్థితి ఏమిటి? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోలో నియామకాల ప్రస్తావన లేదన్నారు. తాను 30 లక్షల మంది నిరుద్యోగులకు విజ్ఞప్తి చేస్తున్నానని.. మీ ఓటు, మీ కన్నతల్లిదండ్రుల ఓటు కలుపుకుంటే దాదాపు 90 లక్షల ఓట్లు అవుతాయని, అవి పడితే చాలు 90 సీట్లు వస్తాయని వివరించారు. అది చేసి కేసీఆర్, కేటీఆర్ ఉద్యోగం ఊడగొడితే చాలన్నారు. కాబట్టి నిరుద్యోగులే కథానాయకులై, కదనరంగంలోకి దిగి, ఇందిరమ్మ రాజ్యం తీసుకు రావాలని చెప్పారు రేవంత్. ఆ తర్వాత ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందన్నారు.

You may also like

Leave a Comment