సీఎం కేసీఅర్ (CM KCR) అవినీతికి మేడిగడ్డ (Medigadda) పూర్తిగా బలై పోయిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. బోథ్‌కు నీళ్ళు రాక పోవడానికి సీఎం కేసీఆర్ కారణమంటూ తీవ్రంగా ఫైర్ అయ్యారు. కేసీఆర్ ఉంటే 2వేలు పెన్షన్.. అదే కాంగ్రెస్ వస్తే 4వేలు పెన్షన్ అని తెలిపారు. కుప్టి ప్రాజెక్టు పూర్తి కావాలంటే డిగ్రీ కాలేజీ రావాలంటే కాంగ్రెస్ అభ్యర్థి గెలవాలన్నారు.
ఆదిలాబాద్ జిల్లా బోథ్‌లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడారు. బీఆర్ఎస్ పాలనలో బోథ్‌కు నీరు ఎందుకు రాలేదని ఆయన ప్రశ్నించారు. ఈ పదేండ్లలో ఆదిలాబాద్, పాలమూరులో ఏం మారలేదని పేర్కొన్నారు. గూడేంలు, తండాల్లో పాఠశాలలు లేవని అన్నారు. ప్రసవం కోసం నరకం చూడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని ఆయన ప్రశ్నించారు.
అన్నారం అయిపోయిందని అన్నారు. మేడిగడ్డ కుంగిపోయిందన్నారు. ఇసుక మీద లక్ష కోట్ల పెట్టి ప్రాజెక్టు నిర్మించారంటూ ఫైర్ అయ్యారు. ఇలా కడితే ఎలా? అంటూ తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో సర్పంచ్‌లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచ్‌లకు బిల్లులు చెల్లించడం లేదని అన్నారు.
ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టినప్పటికి, దద్దమ్మ దయాకర్ రావ్ ఖాళీ సీసాలు అమ్ముకుంటున్నారని ఫైర్ అయ్యారు. డిసెంబర్ 31లోగా డిగ్రీ కాలేజీ, కుప్టి ప్రాజెక్టు పనులను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. 2004లో ఇచ్చిన గ్యారంటీని నిలబెట్టుకుంటూ తెలంగాణను సోనియాగాంధీ ఇచ్చిందన్నారు. ఇప్పడు 6 గ్యారంటీలను ప్రకటించడంతో సీఎం ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి అందరిని కలుస్తున్నాడన్నారు.
హోం మంత్రిని ప్రగతి భవన్‌కు రానియ్యలేదని ఫైర్ అయ్యారు. మంత్రులను కూడా కలవనియ్యడానికి పోలేదన్నారు. ఇందిరమ్మ ఇండ్లు అనాడు ఇచ్చామని అన్నారు. ఇప్పుడు డబుల్ బెడ్రూం ఇండ్లు ఎవరికైనా ఇచ్చారా? అని ప్రశ్నించారు. డబుల్ బెడ్రూం కట్టిన ఊళ్లలో తాము ఓట్లు అడగబమని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన ఊళ్లో తాము ఓట్లు అడుగుతామన్నారు. ఇందిరమ్మ ఇళ్లు లేని ఊరు, హనుమాన్ గుడి లేని గ్రామం తెలంగాణలో లేదన్నారు. కేసీఅర్ వస్తే 2వేలు పెన్షన్… కాంగ్రెస్ వస్తే 4వేల పెన్షన్ వస్తుందన్నారు.