Telugu News » Revanth Reddy : అంతా దుష్ప్రచారం.. కేటీఆర్ కు రేవంత్ కౌంటర్

Revanth Reddy : అంతా దుష్ప్రచారం.. కేటీఆర్ కు రేవంత్ కౌంటర్

తనను గానీ భట్టిని గానీ కామారెడ్డిలో పోటీ చేయాలని ఆదేశిస్తే తప్పకుండా చేస్తామని అన్నారు. పార్టీ ఆదేశిస్తే కామారెడ్డి అయినా సిరిసిల్ల అయినా ఎక్కడైనా తాము పోటీ చేసి గులాబీ నేతలను ఓడిస్తామని తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఒక్కటేనని విమర్శలు చేశారు.

by admin
kcrs

– బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఒక్కటే..
– చెడ్డీ గ్యాంగ్ లాంటివి
– తెలంగాణలో హంగ్ కు ఛాన్స్ లేదు
– పూర్తి మెజార్టీతో కాంగ్రెస్ దే విజయం
– కేసీఆర్ జైలుకు వెళ్లే పరిస్థితి వచ్చింది
– కానీ, కేంద్రమే కాపాడుతోంది
– సరైన టెస్టులు చేయకుండా కాళేశ్వరం కట్టారు
– కక్కుర్తి పడి గాల్లో మేడలు కడితే ఇంతే
– మేము పథకాలు ఆపమని చెప్పడం లేదు
– బీఆర్ఎస్ ది తప్పుడు ప్రచారం
– నవంబర్ 2 లోపే లబ్ధిదారులకు..
– చెల్లింపులు జరగాలని కోరుతున్నాం
– ఇదే విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లామన్న రేవంత్

మేడిగడ్డ (Medigadda) బ్యారేజీ విషయంలో సీఎం కేసీఆర్ (CM KCR) లాజిక్, కామన్ సెన్స్ కోల్పోయారనే అనుమానం ఉందన్నారు రేవంత్ రెడ్డి (Revanth Reddy). ఢిల్లీ (Delhi) లో మీడియాతో మాట్లాడిన ఆయన.. పేలుడు పదార్థాలు పెడితే గాల్లోకి లేస్తాయి తప్ప, భూమిలోకి కుంగవని చెప్పారు. బొగ్గు గనులు ఉండటం వల్లే మేడిగడ్డ పిల్లర్లు కుంగాయని.. సాయిల్ టెస్ట్ చేయించకుండా కక్కుర్తి పడి గాల్లో మేడలు కడితే ఇలాగే ఉంటుందని ఎద్దేవ చేశారు. కేసీఆర్ జైల్లోకి వెళ్లే పరిస్థితి వచ్చిందని.. ఆయనను కాపాడేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

Revanth Reddy strong counter to ktr over Welfare Schemes dispute

బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తోందని.. అందుకే, తాము కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు రేవంత్ రెడ్డి. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన నగదు బదిలీలు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ముందే అమలు చేయాలని కోరామన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ (KTR) ట్వీట్ పై స్పందించారు రేవంత్. సంక్షేమ పథకాలకు నిధులను కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటోందని విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పథకాలను ఆపాలని తాము చెప్పడం లేదని నవంబర్ 2 లోపే లబ్ధిదారులకు చెల్లింపులు జరగాలని కోరుతున్నట్టు తెలిపారు.

ప్రభుత్వ భవనాలను రాజకీయ కార్యకలాపాలకు వినియోగించకుండా చూడాలని ఈసీని కోరామని చెప్పారు రేవంత్. అలాగే, బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్న రిటైర్డ్ అధికారులను ఎన్నికల విధుల నుంచి వెంటనే తొలిగించాలని అన్నారు. డీజీపీ అంజనీ కుమార్ ను వెంటనే తొలిగించాలని ఈసీకి ఫిర్యాదు చేశామని తెలిపారు. నిష్పక్షపాతంగా వ్యవహరించే అధికారులను నియమించాలని చెప్పామన్నారు. కీలకమైన శాఖలను కొందరు ఐఏఎస్ లు ఎన్నో ఏళ్లుగా నిర్వహిస్తున్నారని గుర్తు చేశారు.

ఇక, పోటీ విషయంలో అధిష్టానానిదే ఫైనల్ అని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. తనను గానీ భట్టిని గానీ కామారెడ్డిలో పోటీ చేయాలని ఆదేశిస్తే తప్పకుండా చేస్తామని అన్నారు. పార్టీ ఆదేశిస్తే కామారెడ్డి అయినా సిరిసిల్ల అయినా ఎక్కడైనా తాము పోటీ చేసి గులాబీ నేతలను ఓడిస్తామని తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఒక్కటేనని విమర్శలు చేశారు. ఈ మూడు పార్టీలు చెడ్డీ గ్యాంగ్ లాంటివని సెటైర్లు వేశారు. తెలుగు రాష్ట్రాల్లో హంగ్ పరిస్థితి గతంలో ఎన్నడూ లేదన్న ఆయన.. ఈసారి కూడా ఉండదని.. పూర్తి మెజార్టీతో కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు.

You may also like

Leave a Comment