సీఎం కేసీఆర్ (CM KCR) కు టీపీసీసీ చీఫ్ (TPCC Chief) రేవంత్ రెడ్డి (Revanth Reddy) బహిరంగ లేఖ (Open Letter) రాశారు. తెలంగాణలో బీసీ జనగణన చేపట్టాలని లేఖలో సీఎంను డిమాండ్ చేశారు. బీసీ సంక్షేమం కోసం ప్రత్యేక పాలసీని బీఆర్ఎస్ (BRS) చెప్పిన మాటలన్నీ ఉత్త ముచ్చట్లుగానే మిగిలి పోయాయని ఫైర్ అయ్యారు.
బీసీల కోసం ఇంత చేస్తున్నాం, అంత చేస్తున్నామని గొప్పలు చెప్పుకోవడమే తప్పా బీసీలకు బీఆర్ఎస్ చేసిందేమీ లేదన్నారు. జనాభా దామాషా ప్రకారం బీసీలకు ఆర్థిక. సామాజిక, రాజకీయంగా వారికి న్యాయంగా వాళ్లకు రావాల్సిన వాటా వాళ్లకు దక్కాలంటే అది బీసీ జన గణనతోనే సాధ్యమవుతుందన్నారు. అందుకే రాష్ట్రంలో కుల గణన చేపట్టాలని సూచించారు.
2014లో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. బిహార్ లో కుల గణను కేంద్రం అడ్డంకులు సృష్టించాలని అనుకుందన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఇండియా కూటమిలోని బిహార్ ప్రభుత్వం కుల గణనను విజయవంతంగా పూర్తి చేసిందన్నారు. ఆ వివరాలను ప్రజల ముందు పెట్టిందన్నారు.
బీఆర్ఎస్ పాలనలో కేవలం ప్రభుత్వంలోనే కాకుండా అటు పార్టీలోనూ కేవలం 20 సీట్లు మాత్రమే ఇచ్చి బీసీలను రాజకీయంగా కూడా అణగదొక్కాలని కుట్రలు చేస్తోందన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ బీసీ జనగణన డిమాండ్‌ను పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. బీసీనని చెప్పుకుని అధికారంలోకి వచ్చిన ప్రధాని మోడీ ఇప్పుడు బీసీల డిమాండ్ ను నెరవేర్చుందుకు చొరవ చూపకపోవడం దురదృష్టకరమన్నారు.