కాంగ్రెస్ (Congress) బస్సు యాత్రపై మంత్రి కేటీఆర్ (KTR) ట్వీట్ చేశారు. కాంగ్రెస్ చేపట్టిన బస్సు యాత్ర ఖచ్చితంగా తుస్సు మంటుందని ఆయన అన్నారు. దీనిపై తాజాగా రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్పందించారు. మంత్రి కేటీఆర్ ట్వీట్ కు టీపీసీసీ చీఫ్ ( T-PCC Chief) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
నిస్సిగ్గు మాటలు, ఎదురుదాడులకు. కేరాఫ్ అడ్రస్ డ్రామారావు అంటూ రేవంత్ తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. పదేండ్ల పాటు అధికారంలో ఉండి మోడీ-కేడీతో అంట కాగారంటూ తీవ్రంగా ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ఇచ్చిన గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు పరిశ్రమకు ప్రధాని మోడీ పాతర వేశారన్నారు.
కాంగ్రెస్ ఇచ్చిన ఐటీఐఆర్ ప్రాజెక్టును పాతాళానికి తొక్కిన వ్యక్తి మోడీ – కేడీ అంటూ ధ్వజమెత్తారు. విభజన చట్టంలోని పేర్కొన్న హామీలను పూర్తిగా అమలు చేయించలేని దద్దమ్మలం అని నీవే ఒప్పుకుంటున్నావు అంటూ తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. తెలంగాణకు ఈ దద్దమ్మ పాలన ఇక మీదట అవసరం లేదంటూ తీవ్రంగా మండిపడ్డారు.
అంతకు ముందు కేటీఆర్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ బస్సు యాత్ర తుస్సుమంటుందన్నారు. సంక్షేమంలో సర్ణయుగానికి తెలంగాణ కేరాఫ్ అడ్రస్ గా నిలిచిందన్నారు. చీకటి పాలనకు చిరునామాగా కాంగ్రెస్ పాలనలోని కర్ణాటక నిలిచిందన్నారు. గిరిజన వర్శిటీపై రాహుల్ గాంధీ పదేండ్లుగా ఎందుకు నోరు మెదపలేదని ఆయన ప్రశ్నించారు.