షహీద్ ఫజల్-ఎ-హక్ ఖైరాబాదీ (SHAHEED FAZL -e- HAQ KHARABADI)….ఉర్దూ, పార్శీ సాహిత్యాల్లో గొప్ప పండితుడు. ఖాజా విభాగంలో ముఫ్తి (గా పని చేశారు. యుద్దంలో బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసేలా ప్రజల్లో తన ఉపన్యాసాలతో స్పూర్తి నింపిన గొప్ప నాయకుడు. యుద్దంలో బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా జిహాద్ చేయాలని ఫత్వా (Fatwa)జారీ చేసి చివరకు మరణ శిక్ష అనుభవించిన దేశ భక్తుడు.
1796లో యూపీ సీతాపూర్‌లోని ఖైరాబాద్ లో జన్మించారు. తండ్రి సదర్-ఉల్-సదర్. మత పరమైన విషయాల్లో మొఘల్స్ కు సదర్ ఉల్ సదర్ సలహాదారునిగా పని చేశారు. 13 సంవత్సరాల వయస్సులోనే ఖైరాబాదీ ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు. 1828లో ఖాజా విభాగంలో ముఫ్తీగా నియమితుడయ్యారు. 1857 తిరుగుబాటు సమయంలో మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జఫర్‌తో షహీద్ ఖైరాబాదీ అనేక సార్లు సమావేశాలు అయ్యారు.
జూన్ 26, 1857న జనరల్ బఖ్త్ ఖాన్ తన 14000 సైన్యంతో కలిసి బరేలీ నుండి ఢిల్లీకి చేరుకున్నారు. ఆ సమయంలో షహీద్ ఖైరాబాది శుక్రవారం గొప్ప ఉపన్యాసం ఇచ్చారు. వలస ప్రభుత్వానికి వ్యతిరేకంగా జిహాద్‌కు పిలుపునిస్తూ ఫత్వాను ఖైరాబాదీ జారీ చేశారు. ఢిల్లీని చుట్టు ముట్టిన బ్రిటీష్‌పై బలగాలపై యుద్దానికి ప్రజలను తన ఉపన్యాసాలతో ప్రేరేపించారు.
హింసను ప్రేరేపించారనే ఆరోపణలపై 30 జనవరి 1859న షహీద్ హక్ ను ఖైరాబాద్‌లో బ్రిటీష్ పోలీసులు అరెస్టు చేశారు. జిహాద్ కోసం ఫత్వా జారీ చేశారని, బ్రిటీష్ పై ప్రజలను తిరుగుబాటు వెనుకు ప్రధాన పాత్ర పోషించారని బ్రిటీష్ అధికారులు తేల్చారు. 8 అక్టోబర్ 1859న ఆయన్ని అండమాన్ జైలుకు తరలించారు. అక్కడ శిక్ష అనుభవిస్తూ 1861 మరణించారు.