Telugu News » చెయ్యను అని మొండిగా చెప్పాక మెగాస్టార్ “గ్యాంగ్ లీడర్” సినిమాను మళ్ళీ ఎందుకు చేసారు?

చెయ్యను అని మొండిగా చెప్పాక మెగాస్టార్ “గ్యాంగ్ లీడర్” సినిమాను మళ్ళీ ఎందుకు చేసారు?

చెయ్యను అని చెప్పేసాక మెగాస్టార్ గ్యాంగ్ లీడర్ సినిమా ఎందుకు చేసారు?

by Sri Lakshmi

మెగాస్టార్ ఇప్పటివరకు 150 కి పైనే సినిమాలు చేశారు. వీటిల్లో చాలా సినిమాలు బ్లాక్ బూస్టర్లుగానే నిలిచాయి. అయితే.. ఇన్ని సినిమాల్లో మెగాస్టార్ కి ఆ బిరుదుని తీసుకొచ్చిన సినిమా మాత్రం గ్యాంగ్ లీడర్ సినిమా. ఈ సినిమా చిరు కెరీర్ లో ఓ మైలురాయిగా నిలిచిపోయింది. విజయశాంతి, మెగాస్టార్ మధ్య కెమిస్ట్రీ బాగా కుదరడంతో ఈ సినిమా పాటలు కూడా నెక్స్ట్ లెవెల్ హిట్ అయ్యాయి. అప్పట్లో ఈ సినిమా పాటలను చూడడం కోసమే మళ్ళీ మళ్ళీ థియేటర్ కు వెళ్లిన ప్రేక్షకులు కూడా ఉన్నారు.

కానీ, అంతటి విజయం సాధించిన ఈ సినిమాను చేయడానికి ముందు చిరంజీవి ఒప్పుకోలేదు. ఈ సినిమాకు దర్శకత్వం వహించింది విజయ్ బాపినీడు. ఆయన పట్నం వచ్చిన పతివ్రతలు, మగధీరుడు, హీరో వంటి సినిమాలతో మెగాస్టార్ కి హిట్స్ ఇచ్చారు. సరికొత్త కథతో మళ్ళి మెగాస్టార్ కి హిట్ ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో “గ్యాంగ్ లీడర్” స్టోరీ రాసుకున్నారు. ఈ స్టోరీని వినిపించగానే మెగాస్టార్ ఈ సినిమా నేను చెయ్యను, ఇది ఆడదు అని చెప్పేశారట. కానీ, విజయ్ బాపినీడు మాత్రం వదల్లేదు. ఆ కథని పరుచూరి బ్రదర్స్ కి వినిపించారు.

వారు ఆ కథలోని లోపాలను గుర్తించి వాటిని సరి చేస్తామని, మూడు రోజుల టైం కావాలని అడిగారట. అదే విషయాన్నీ చిరుకి చెప్పగా ఆయన పరుచూరి బ్రదర్స్ ని నమ్మి ఒకే చేశారట. ఆ తరువాత కథని తీసుకొచ్చి వినిపించగా మెగాస్టార్ సరే అన్నారు. అల్లు అరవింద్ ని పిలిచి డేట్స్ మాట్లాడమని అన్నారట. అల్లు అరవింద్ కూడా ఆ కథని చెప్పమని చెప్పి.. దానిని రికార్డు చేసుకుని మరీ ఇంటికి వెళ్లారట. మళ్ళీ ఆ కథని సరిగ్గా విని అప్పటికి కానీ ఒకే చేయలేదట.

You may also like

Leave a Comment