Telugu News » Rhea Chakraborty: సుశాంత్‌ సింగ్‌ మృతి కేసులో బిగ్ ట్విస్ట్..!

Rhea Chakraborty: సుశాంత్‌ సింగ్‌ మృతి కేసులో బిగ్ ట్విస్ట్..!

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్(Sushant Singh) మృతి కేసు(Death case) కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో సుశాంత్ ప్రయురాలు, సినీ నటి రియా చక్రవర్తికి(Rhea Chakraborty), ఆమె కుటుంబ సభ్యులకు భారీ ఊరట లభించింది.

by Mano
Rhea Chakraborty: Big twist in Sushant Singh's death case..!

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్(Sushant Singh) మృతి కేసు(Death case) కీలక మలుపు తిరిగింది. సుశాంత్ ప్రయురాలు, సినీ నటి రియా చక్రవర్తికి(Rhea Chakraborty), ఆమె కుటుంబ సభ్యులకు భారీ ఊరట లభించింది. వీరిపై సీబీఐ(CBI) జారీ చేసిన లుకౌట్ సర్క్యులర్‌ను బాంబే హైకోర్టు(High Court of Bombay) రద్దు చేసింది.

Rhea Chakraborty: Big twist in Sushant Singh's death case..!

అయితే, 2020 జూన్ 14న ముంబైలోని తన నివాసంలో సుశాంత్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. కాగా, సుశాంత్‌సింగ్‌ది ఆత్మహత్య కాదని ఆరోపించిన ఆయన కుటుంబసభ్యులు రియా చక్రవర్తి, ఆమె కుటుంబ సభ్యులపై కేసు పెట్టారు. సుశాంత్ బ్యాంకు ఖాతా నుంచి రూ.15కోట్లు బదిలీ చేసుకున్నారంటూ ఆయన తండ్రి కేకే సింగ్ ఆరోపించారు.

ఈ క్రమంలో రియా చక్రవర్తిని ఈడీ ప్రశ్నించింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగించింది. రియా, ఆమె సోదరుడు షోవిక్, తండ్రి ఇంద్రజిత్ సుశాంత్‌కు మాదకద్రవ్యాలు ఇచ్చారనే ఆరోపణలను ఎదుర్కొన్నారు. వీరిద్దరికి జైలుశిక్ష పడింది. ఈ క్రమంలో వీరు విదేశాలకు వెళ్లకుండా లుకౌట్ సర్క్యులర్‌ను కూడా జారీ చేసింది.

మరోవైపు తాము సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు ఈ ఆర్డర్‌పై నాలుగు వారాల పాటు స్టే విధించాలన్న సీబీఐ తరపు న్యాయవాది విన్నపాన్ని హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం తిరస్కరించింది. దీంతో వీరు బాంబే హైకోర్టును ఆశ్రయించగా లుకౌట్ సర్క్యులర్‌ను రద్దు చేస్తూ తీర్పును వెలువరించింది.

You may also like

Leave a Comment