రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో జరుగుతోన్న రోడ్డు ప్రమాదాలు.. ప్రజలని భయకంపితులను చేస్తున్నాయి.. నిత్యం ఎక్కడో ఒకచోట రోడ్డు ప్రమాదాల బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా సంగారెడ్డి (Sangareddy) జిల్లాలోని 65వ నంబర్ జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
నాందేడ్ (Nanded ).. అకోల (Akola) రహదారిలో మామిడిపల్లి ఎక్స్ రోడ్డు వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. బైక్‌పై వెళ్తున్న ఇద్దరిని లారీ ఢీకొట్టింది. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. ప్రమాద సమాచారం అందుకొన్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులు అరబిందో పరిశ్రమలో కార్మికులుగా గుర్తించిన పోలీసులు.. వీరు శ్రీకాకుళం చెందిన వారని తెలిపారు..
మరోవైపు పటాన్‌చెరు (Patancheru) పోలీస్‌స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. బిస్కెట్ ప్యాకెట్ కొనేందుకు వెళ్లి తిరిగి వస్తూ రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఓ వ్యక్తితోపాటు నాలుగేళ్ల బాలుడు చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. అస్సాం రాష్ట్రానికి చెందిన అబేద్ అలీ తో పాటుగా కొందరు స్థానికంగా ఉన్న వేంకటేశ్వర బ్రిక్స్ కంపెనీలో పని చేసుకుంటూ పక్కనే గుడిసెలు వేసుకొని జీవనం సాగిస్తున్నారు.
వీరు పనిచేసే చోట బీహార్‌కు చెందిన వ్యక్తి కూడా పని చేస్తున్నాడు.. కాగా మరణించిన వారిలో బీహార్ కి చెందిన సోనుకుమార్, అబేద్ అలీ కుమారుడు రంజన్ అలీ ఉన్నారు. పటాన్‌చెరు వైపు నుంచి సంగారెడ్డి వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకోంది.. కాగా సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పటాన్‌చెరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.