Telugu News » Rohith Sharma: కెప్టెన్‌గా చరిత్ర సృ‌ష్టించనున్న రోహిత్ శర్మ.. మరో 12 పరుగులే..!!

Rohith Sharma: కెప్టెన్‌గా చరిత్ర సృ‌ష్టించనున్న రోహిత్ శర్మ.. మరో 12 పరుగులే..!!

ఇవాళ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగనున్న మ్యాచ్‌లో భారత జట్టు నెదర్లాండ్స్‌తో తలపడనుంది. మరో 4 ఫోర్లు కొడితే రోహిత్‌శర్మ కెప్టెన్‌గా వన్డేల్లో 100 ఫోర్లను పూర్తి చేసుకుంటాడు. మరో 108 పరుగులు చేస్తే కెప్టెన్‌గా వన్డేల్లో 2వేల పరుగులను చేరుకుంటాడు.

by Mano
Rohith Sharma: Rohit Sharma will create history as a captain.. 12 more runs..!!

వన్డే ప్రపంచకప్‌-2023 (World Cup)లో టీమిండియా తిరుగులేని విజయాలను అందుకుంటోంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్‌శర్మ(Rohith Sharma) మరో రికార్డుకు దగ్గరలో ఉన్నాడు. కేవలం 12 పరుగులు చేస్తే చాలు హిట్ మ్యాన్ కెప్టెన్‌గా చరిత్ర సృష్టించనున్నాడు. ఇవాళ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగనున్న మ్యాచ్‌లో భారత జట్టు నెదర్లాండ్స్‌తో తలపడనుంది.

Rohith Sharma: Rohit Sharma will create history as a captain.. 12 more runs..!!

అలాగే ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌గా రోహిత్ శర్మ మరిన్ని రికార్డులను అందుకునే అవకాశాలున్నాయి. మరో 4 ఫోర్లు కొడితే కెప్టెన్‌గా వన్డేల్లో 100 ఫోర్లను పూర్తి చేసుకుంటాడు. మరో 108 పరుగులు చేస్తే రోహిత్ కెప్టెన్‌గా వన్డేల్లో 2వేల పరుగులను చేరుకుంటాడు. కాగా వన్డే ప్రపంచకప్ 2023 సెమీ ఫైనల్‌లో భారత్ ప్రత్యర్థి ఖరారు అయింది. సెమీస్‌లో టీమిండియా న్యూజిలాండ్‌తో తలపడనుంది.

ముంబైలోని వాఖండే స్టేడియం వేదికగా ఈ నెల 15న ఈ మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో కివీస్‌ను ఓడించి 2019 ప్రపంచకప్‌ సెమీస్‌లో ఆ జట్టు చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా పట్టుదతో ఉంది. ఇక కోల్‌కతాలోని ఈడెన్‌గార్డెన్స్ స్టేడియం వేదికగా ఈ నెల 16న రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. రెండో సెమీస్‌లో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి.

అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా 19న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. భారత్ టీమ్ ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో అన్నీ గెలిచి అందరికంటే ముందుగానే సెమీస్ కైవలం చేసుకుంది. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు ఒక మ్యాచ్ కూడా ఓడిపోని జట్టు భారత్ మాత్రమే. ఇక లీగ్ దశలో భారత జట్టు తన చివరి మ్యాచ్‌కు సిద్ధమైంది.

You may also like

Leave a Comment