వరల్డ్ కప్(World cup)లో టీమ్ ఇండియా సక్సెస్ ఫుల్‌గా దూసుకు పోతోంది. ఈ వరల్డ్ కప్‌లో ఎవరూ ఆడని విధంగా ఇండియాను ఎనిమిది మ్యాచ్‌ల్లో సక్సెస్‌గా నడిపించిన రోహిత్ శర్మ. ప్రపంచ దేశాలు ఈ టైటిల్‌ను అందుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినా భారత్ ముందు నిలబడలేకపోయాయి.
అద్భుతమైన ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో నిలిచి సెమీఫైనల్ ఆడడానికి ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోంది టీమిండియా. తాజాగా ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ చిన్ననాటి కోచ్ కీలక వ్యాఖ్యలు చేయడం ప్రత్యేకతను సంతరించుకుంది.
రోహిత్ చిన్న నాటి కోచ్ దినేష్ లాడ్ మాట్లాడుతూ.. ఇండియా కచ్చితంగా వరల్డ్ కప్‌ను గెలుచుకుంటుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రోహిత్ శర్మ చేతుల మీదుగా టైటిల్ అందుకుంటే చూడాలని ఉందన్నారు. ఈ టోర్నీలో ఇండియా అద్భుతంగా ఆడుతోంది అంటూ ప్రశంసల వర్షం కురిపించారు.
భారత్ నిర్విరామ విజయాలకు కారణం లేకపోలేదు. టీమ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ తీసుకుంటున్న నిర్ణయాలు చాలా వరకు ప్లస్ అవుతున్నాయని పలువురు అంటున్నారు. రోహిత్ శర్మ వల్లే భారత్ ప్రపంచ కప్ టైటిల్‌కు కొన్ని అడుగుల దూరంలోకి వచ్చి చేరిందన్నారు. అయితే ఈ టైటిల్‌ను భారత్ కైవసం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు.