Telugu News » Rk Roja : చంద్రబాబు జైల్లోనే ఉండాలని నారా భువనేశ్వరి పూజలు చేసినట్లు ఉన్నారు…!

Rk Roja : చంద్రబాబు జైల్లోనే ఉండాలని నారా భువనేశ్వరి పూజలు చేసినట్లు ఉన్నారు…!

నిజమే గనుక విజయం సాధిస్తే చంద్రబాబు జీవితాంతం జైల్లో ఉంటారని తెలిపారు.

by Ramu
Will Roja get a ticket

నిజం గెలవాలని బాగా గట్టిగా దేవుడికి నారా భువనేశ్వరి (Nara Buvaneshwari) పూజలు చేశారని మంత్రి రోజా (Roja) అన్నారు. తాము కూడా నిజం గెలవాలనే కోరుకుంటున్నామని చెప్పారు. చంద్రబాబు శాశ్వతంగా జైల్లోనే ఉండాలని వెంకటేశ్వర స్వామికి భువనేశ్వరి పూజలు చేసినట్లు ఉన్నారని ఆమె అన్నారు. నిజమే గనుక విజయం సాధిస్తే చంద్రబాబు జీవితాంతం జైల్లో ఉంటారని తెలిపారు.

 

ఒక వేళ నిజం గెలవాలని నారా భువనేశ్వరి మనస్పూర్తిగా అనుకుంటే సీబీఐ ఎంక్వైయిరీ కోరాలన్నారు. అలా అయితే నిజం ఖచ్చితంగా గెలుస్తుందన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్, ఐఆర్ఆర్ కేసులో సీబీఐ దర్యాప్తును భువనేశ్వరీ కోరాలని డిమాండ్ చేశారు. టీడీపీ- జనసేన పొత్తులపై మంత్రి రోజా తీవ్ర విమర్శలు గుప్పించారు.

నారా భువనేశ్వరి ఇప్పుడు యాత్ర చేసే పరిస్థితి లేదన్నారు. యువగళానికి లోకేశ్ మంగళం పాడాడని ఎద్దేవా చేశారు. ఫ్యాషన్ షోకు వెళ్ళి వీళ్ళు ప్రజల కోసం రోడ్డు మీదకు రాలేరు అని సెటైర్లు వేశారు. ప్రజలు నారా లోకేశ్, పవన్ కళ్యాణ్ లను చీకోట్టి ఓడించారన్నారు.

పవన్, లోకేశ్ ఇద్దరు కలిసి పాడుతా తీయగా కార్యక్రమం నిర్వహించారని అన్నారు. పాడుతా తీయగా లాగా ఇటో ఆరుగురు, అటో ఆరుగురు కలిసి సెలక్షన్ చేశారన్నారు. ఈ అర సున్న, ఆ అర సున్న కూర్చుని జైల్లో ఉన్న గుండు సున్న కోసం పార్టీ దశ, దిశపై చర్చించారని అనడం కామెడిగా ఉందన్నారు.

వై ఏపీ నీడ్స్ పవన్ కళ్యాణ్,చంద్రబాబు అనే నినాదాన్ని పెట్టుకుని ప్రజల్లోకి వెళ్ళే దమ్ము ధైర్యం ఆ పార్టీ నేతలకు ఉందా ఆమె నిలదీశారు. అలా వెళితే వాళ్ల పళ్లను ప్రజలు రాలగొడతారన్నారు. చంద్రబాబు జైల్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదన్నారు.

You may also like

Leave a Comment