రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థినుల వరుస ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల భువనగిరి గురుకుల హాస్టల్(Bhuvangiri Gurukula Hostel)లో ఇద్దరు పదో తరగతి విద్యార్థినులు ఒకే గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై విచారణ జరుగుతుండగానే తాజాగా ఇవాళ గురుకుల పాఠశాలకు చెందిన మరో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది.
సూర్యపేటలోని ఇమాంపేట గురుకుల హాస్టల్‌లో వైష్ణవి(Vaishnavi) అనే ఇంటర్ సెకండియర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ క్రమంలో రాష్ట్రంలో విద్యార్థినుల వరుస ఆత్మహత్యలపై బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(BSP State Chief RS Praveen Kumar) ఎక్స్ వేదికగా స్పందించారు.
భువనగిరి ఎస్సీ బాలికల వసతి గృహంలో ఆత్మహత్యలకు పాల్పడిన భవ్య, వైష్ణవిల శవాలకు తడి ఆరకముందే సూర్యాపేట గురుకుల పాఠశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న దగ్గుపాటి వైష్ణవి ఆత్మహత్యకు పాల్పడడం చాలా విషాదకరమన్నారు. ‘ అయ్యా సీఎం గారూ.. మీ ఆరు గ్యారంటీల మాట దేవుడెరుగు.. దయచేసి మా బిడ్డల ప్రాణాలకైనా గ్యారంటీ ఇవ్వండి’ అంటూ పేర్కొన్నారు.
వసతి గృహాల్లో విద్యార్థినుల వరుస ఆత్మహత్యలపై ప్రభుత్వం తక్షణమే సమగ్ర విచారణ జరిపాలని డిమాండ్ చేశారు. ప్రతీ వసతి, ఆశ్రమ, గురుకుల పాఠశాలకు ఒక సైకాలజిస్టు లేదా కౌన్సిలర్‌ను వెంటనే నియమించాలని సూచించారు. విద్యార్థినుల ఆత్మహత్యలకు కారణమైన వ్యక్తులను వెంటనే శిక్షించాలన్నారు. మృతురాలి కుటుంబానికి ఎక్స్ గ్రేషియాతో పాటు, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ట్వీట్ చేశారు.
భువనగిరి ఎస్సీ బాలికల వసతి గృహంలో ఆత్మహత్యలకు పాల్పడిన భవ్య,వైష్ణవిల శవాలకు తడి ఆరకముందే సూర్యాపేట #TSWREIS బాలిక గురుకులంలో ఇంటర్ర్ రెండో సంవత్సరం చదువుతున్న దగ్గుపాటి వైష్ణవి ఆత్మహత్యకు పాల్పడడం చాలా విషాదకరం.
అయ్యా…ముఖ్యమంత్రి @revanth_anumula గారు,
మీ "ఆరు గ్యారంటీల" మాట… pic.twitter.com/Ft95tVKmAz— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) February 11, 2024