Telugu News » Mancherial : బాల్క సుమన్ నోటి దురుసు.. నోటీసులు అందచేసిన పోలీసులు..!

Mancherial : బాల్క సుమన్ నోటి దురుసు.. నోటీసులు అందచేసిన పోలీసులు..!

మరోవైపు నోటీసులు అందుకొన్న బాల్క సుమన్ కీలక వ్యాఖ్యలు చేశారు.. సీఎం తనపై అక్రమంగా కేసు పెట్టారని ఆరోపించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఎన్నో కేసులను ఎదుర్కొని పోరాటం చేశానని..

by Venu

సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)పై, బీఆర్ఎస్ (BRS) మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ (Balka Suman) అనుచిత వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డ విషయం తెలిసిందే. ఈ అంశంపై మంచిర్యాల (Mancherial) పోలీసులు కేసు సైతం నమోదు చేశారు.. అయితే తాజాగా ఈ కేసుకు సంబంధించి మంచిర్యాల పోలీసులు నోటీసులు అందజేశారు. నేడు హైదరాబాద్‌లో ఉన్న సుమన్‌‌కు, మంచిర్యాల ఎస్సై నోటీసులు అందించారు. ఈ సందర్భంగా విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.

Balka Suman: CM Revanth Reddy is afraid... Key comments of former MLA...!

మరోవైపు నోటీసులు అందుకొన్న బాల్క సుమన్ కీలక వ్యాఖ్యలు చేశారు.. సీఎం తనపై అక్రమంగా కేసు పెట్టారని ఆరోపించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఎన్నో కేసులను ఎదుర్కొని పోరాటం చేశానని.. ఇలాంటి అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నేరవేర్చే వరకు ప్రజల పక్షాన పోరాటం చేస్తూంటామని వెల్లడించారు.

ఇదిలా ఉండగా వారం రోజుల క్రితం రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కేసీఆర్‌పై రేవంత్ వ్యాఖ్యలను తప్పుపడుతూ.. కేసీఆర్ జోలికొస్తే చెప్పుతో కొడతా అని పరుష పదజాలాన్ని ఉపయోగించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పద్మనాయక కళ్యాణ మండపంలో జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నోరుజారారు.

ఈ క్రమంలో బాల్క సుమన్ మాటలపై ఆగ్రహించిన కాంగ్రెస్‌ నేతలు.. సీఎం రేవంత్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. వారు 294B, 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అసభ్యపదజాలం వాడడం, బెదిరింపులకు దిగడంలాంటి సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు. నేర పూరిత బెదిరింపులకు పాల్పడ్డారని కాంగ్రెస్‌ నేతలు పోలీసులకు తెలిపారు.. దీంతో బాల్క సుమన్‌పై కేసు నమోదు అయ్యింది.

You may also like

Leave a Comment