అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవాని (Ram Temple inauguration)కి హిందూ, జైన, బౌద్ధ మత సాధువులను ఆహ్వానించేందుకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)అగ్రనేతలు ఢిల్లీలో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఉదాసీన్ ఆశ్రమంలోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
విశ్వహిందూ పరిషత్ (ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని హిందూ సాధువు స్వామి రఘునందన్ నిర్వహిస్తారు. రామ మందిర ప్రారంభోత్సవానికి దేశ వ్యాప్తంగా సుమారు 4000 మంది సాధువులను, 2200 మంది ఇతర అతిథులను ఆహ్వానించామని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు.
జనవరి 22న రామ్ లల్లా విగ్రహానికి ప్రాణప్రతిష్ట చేయనున్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీ సీనియర్ నేతలు ఎల్ కే అద్వానీ, మురళి మనోహర్ జోషి, కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే వంటి రాజకీయ ప్రముఖులకు ఆహ్వానాలు పంపారు. వారితో పాటు వ్యాపారవేత్తలు ముఖేశ్ అంబానీ, అనిల్ అంబానీ, గౌతమ్ అదానీ, రతన్ టాటాలను ఆహ్వనించారు.
ఇక బాలీవుడ్ నుంచి రజనీకాంత్, అమితాబ్ బచ్చన్, మోహన్ లాల్, చిరంజీవి, అక్షయ్ కుమార్ లతో పాటు క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీలకు ఆహ్వానాలు అందాయి. ఇక వీహెచ్ పీ, ఆర్ఎస్ఎస్లు అయోధ్యలో అక్షత పూజ అనంతరం ఆ అక్షింతలను డోర్ టు డోర్ తిరిగి పంపిణీ చేస్తోంది. అక్షింతలతో పాటు శ్రీ రాముని ఫోటోలను పంపిణీ చేస్తున్నారు. జనవరి 1 నుంచి 15 వరకు వాటిని పంపిణీ చేయనున్నారు.