Telugu News » Zelensky: ‘రష్యాతో ఘర్షణ మూడో ప్రపంచ యుద్ధానికి తీరితీయొచ్చు’..!!

Zelensky: ‘రష్యాతో ఘర్షణ మూడో ప్రపంచ యుద్ధానికి తీరితీయొచ్చు’..!!

రష్యాతో ఘర్షణ (Russia- Ukraine Conflict) మూడో ప్రపంచ యుద్ధానికి దారితీయొచ్చని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ (Zelensky) హెచ్చరించారు. జర్మనీ పర్యటనలో ఉన్న ఆయన ఆదివారం ఈ వ్యాఖ్యలు చేశారు.

by Mano
Russia-Ukraine Conflict: 'Clash with Russia could lead to World War III'..!!

రష్యాతో ఘర్షణ (Russia- Ukraine Conflict) మూడో ప్రపంచ యుద్ధానికి దారితీయొచ్చని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ (Zelensky) హెచ్చరించారు. జర్మనీ పర్యటనలో ఉన్న ఆయన ఆదివారం ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా సహా అనేక దేశాలు తమకు మద్దతుగా నిలుస్తున్న నేపథ్యంలో ఏమైనా జరగొచ్చని వ్యాఖ్యానించారు.

Russia-Ukraine Conflict: 'Clash with Russia could lead to World War III'..!!

ఈ విషయం జర్మనీ ఛాన్స్‌లర్ ఒలాఫ్ షోలు కూడా తెలుసని పేర్కొన్నారు. ఒకవేళ నాటో కూటమిలోని సభ్య దేశంపై రష్యా దాడి చేస్తే అది మరో ప్రపంచ యుద్ధానికి నాంది పలకవచ్చని అభిప్రాయపడ్డారు. బెర్లిన్ నుంచి టారస్ క్రూజ్ క్షిపణులు అందకపోవడం వల్ల తాను పెద్దగా నిరాశ చెందలేదని జెలెన్‌స్కీ అన్నారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధిస్తే ఉక్రెయిన్‌కు మద్దతిస్తారా? అని ప్రశ్నించగా అగ్రరాజ్య విదేశాంగ విధానం ఒక వ్యక్తిపై ఆధారపడి ఉండదని వివరించారు. మరోవైపు, ఉక్రెయిన్‌కు అమెరికా ఆర్థిక సాయం తగ్గించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. రష్యాతో పోరాటం కొనసాగుతున్న సమయంలో ఇలాంటి చర్యలు ప్రతికూల సంకేతాలు పంపుతాయని చెప్పారు.

రష్యాతో యుద్ధం విషయంలో ఐరోపా దేశాలకు ఉన్న బలహీనతలను అర్థం చేసుకోగలనన్నారు. ఉక్రెయిన్ ఆక్రమణకు రష్యా సిద్ధమైన సమయంలో జర్మనీ తన వంతు పాత్ర పోషించలేదని తెలిపారు. ఉక్రెయిన్ కోసం ఇతర ఐరోపా దేశాలతో కలిసి ఇప్పుడు అది పెద్ద ఎత్తున నిధులను సమీకరించే ప్రయత్నం చేయాలని జెలెన్‌స్కీ సూచించారు.

You may also like

Leave a Comment