Telugu News » Sabarimala: శబరిమలకు పోటెత్తిన భక్తులు.. భారీ ట్రాఫిక్ జామ్..!

Sabarimala: శబరిమలకు పోటెత్తిన భక్తులు.. భారీ ట్రాఫిక్ జామ్..!

వివిధ రాష్ట్రాల నుంచి శబరిమలకు అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. కేరళలోని ఎరుమేలి వద్ద నాలుగు కిలోమీటర్లకుపైగా వాహనాలు నిలిచిపోయాయి.

by Mano
Sabarimala: Devotees flock to Sabarimala.. Huge traffic jam..!

శబరిమల(Sabarimala) అయ్యప్ప ఆలయానికి (Ayyapa Temple) భక్తులు పోటెత్తారు. వేలాది మంది భక్తులు తరలివచ్చి అయ్యప్పస్వామిని దర్శించుకున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, యూపీ నుంచి లక్షలాది మంది అయ్యప్ప మాలధారులు, భక్తులు శబరిగిరులకు క్యూకట్టారు.

Sabarimala: Devotees flock to Sabarimala.. Huge traffic jam..!

వివిధ రాష్ట్రాల నుంచి శబరిమలకు అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. కేరళలోని ఎరుమేలి వద్ద నాలుగు కిలోమీటర్లకుపైగా వాహనాలు నిలిచిపోయాయి. తెల్లవారు జామున 4 గంటల నుంచి భక్తులు ఇబ్బందులుపడుతున్నారు. పలువురు భక్తులు ఎరుమేలి నుంచి శబరిమలకు పాదయాత్రగా పయనమవుతున్నారు.

భక్తుల తాకిడి ఎక్కువగా ఉండడంతో శబరిమల ఆలయానికి సంప్రదాయ అటవీ మార్గంలో వెళ్లేందుకు ప్రభుత్వం సమయాన్ని పొడిగించింది. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 4.30గంటల వరకు అనుమతిచ్చింది. ఈ సంప్రదాయ అటవీ మార్గం ఎరుమేలి నుంచి పంబా వరకు అటవీ మార్గం గుండా ఎనిమిది గంటల సమయం పడుతుంది.

మరోవైపు, స్వామివారి మాలధారణలో చిన్నారులు సైతం ఉండగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. స్వామివారి దర్శనానికి గంటల తరబడి సమయం పడుతోంది. ఈక్రమంలో పలువురు భక్తులు స్వామివారి దర్శనం చేసుకోకుండానే వెనుదిరుగుతున్నారు.

You may also like

Leave a Comment