ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) సీజన్-2024లో భాగంగా నేడు హైదరాబాద్‌లోని(Hyderabad) ఉప్పల్ (Uppal) స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదారాబాద్ వర్సెస్ చెన్నయ్ సూపర్ కింగ్స్(HYD-CSK) మధ్య మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. అయితే, ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్‌కు సంబంధించి టికెట్లు మొత్తం బ్లాక్‌లో అధిక ధరకు విక్రయించారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (MLA NAGender) ఆరోపించారు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA) కాంప్లిమెంటరీ పాసులు పూర్తిగా దుర్వినియోగం అవుతున్నాయని ఆరోపించారు. తక్షణమే బ్లాక్ టికెట్ల దందాకు పోలీసులు చెక్ పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. అసలు హెచ్‌సీఏ కరెంట్ బిల్లులు చెల్లించలేని పరిస్థితికి ఎందుకు వచ్చిందని, దానికి కారణం ఎవరని ఎమ్మెల్యే ప్రశ్నించారు.
అంతేకాకుండా సన్ రైజర్స్ జట్టు యాజమాన్యమే టికెట్లను బ్లాక్‌లో విక్రయిస్తుందంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఈ బ్లాక్ టికెట్ల కారణంగా సామాన్యులు క్రికెట్ మ్యాచులు చూడలేకపోతున్నారని ఆయన ఫైర్ అయ్యారు.
కాంప్లిమెంటరీ టికెట్ రూ.1000ను బ్లాక్‌లో 10 వేలకు అమ్ముతున్నారని, రూ.6 వేల టికెట్‌ను రూ.30వేలకు అమ్ముతున్నారని ఆరోపించారు.జెమిని కిరణ్ అనే వ్యక్తికి గంపగుత్తగా టికెట్లను ఇచ్చి బ్లాక్‌లో అమ్మిస్తున్నారని, ఈ దందాను హెచ్‌సీఏ నడిపిస్తోందని దానం ఆరోపించారు.దీనిపై సుమోటోగా కేసు నమోదు చేసుకుని విచారణ జరిపి పోలీసులు చర్యలు తీసుకోవాలని దానం నాగేందర్ డిమాండ్ చేశారు. కాగా, ఇటీవల దానం బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.