గురుద్వారాలను(Gurudwara) కూల్చిపారేయాలంటూ రాజస్థాన్ బీజేపీ నేత సందీప్ దాయామా(Sandeep Dayma) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సిక్కుల పవిత్రస్థలమైన గురుద్వారాలపై ఆయన చేసిన వ్యాఖ్యలతో సిక్కు నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో బీజేపీ(BJP) అతడిని పార్టీ నుంచి బహిష్కరించింది. సందీప్ దయామాపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేత, పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్(Amarinder Singh) డిమాండ్ చేశారు.
ఇటీవల రాజస్థాన్ లోని అల్లర్లలో జరిగిన ఎన్నికల ర్యాలీలో సందీప్ దయామా మాట్లాడుతూ.. తిజారాలో ఎక్కడ పడితే అక్కడ గురుద్వారాలు కట్టారని, అవి మనకు భవిష్యత్తులో నష్టదాయకంగా మారతాయని, వాటిని కూల్చిపారేయాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. అది మన బాధ్యతని నొక్కి చెప్పారు. దీనికి యోగి కూడా చప్పట్లు కొట్టారు. ఈ వ్యాఖ్యలకు గానూ.. రాజస్థాన్ బీజేపీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ ఓంకార్ సింగ్ లఖావత్ స్పందిస్తూ పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినందుకు రాష్ట్ర అధ్యక్షుడి ఆదేశాల మేరు సందీప్ దయామాను పార్టీ నుంచి బహిష్కరించినట్లు వెల్లడించారు.
సందీప్ వ్యాఖ్యలపై సిక్కులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన దిష్టి బొమ్మలను దహనం చేశారు. దీంతో సందీప్ క్షమాపణలు చెప్పారు. గురుద్వారాకు వెళ్లి క్షమాపణ పత్రం రాసిచ్చారు. శిరోమణి గురుద్వారా కమిటీ నిర్ణయం మేరకు ఏ శిక్షకైనా సిధ్ధమన్నారు. సంజయ్ రాసిచ్చిన క్షమాపణ పత్రాన్ని అమృత్‌సర్ అకల్ తఖ్త్ కమిటీకి పంపుతామని స్థానిక గురుద్వారా నిర్వహణ కమిటీ ప్రకటించింది.
ఆ తర్వాత తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు. అయితే పంజాబ్‌కు చెందిన నేతలు శాంతించలేదు. పంజాబ్ బీజేపీ చీఫ్ సునీల్ జాఖర్ మాట్లాడుతూ.. అతని వ్యాఖ్యల్ని క్షమించలేమని చెపారు. అమరీందర్ సింగ్ సందీప్ దయామాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పంజాబ్ బీజేపీ మహిళా విభాగం చీఫ్ జై ఇందర్ కౌర్ చండీగఢ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.