Telugu News » Sandeshkhali : ఈడీ టార్గెట్ షేక్ షాజహాన్.. సందేశ్‌‌ఖాలీలో రెయిడ్స్..!

Sandeshkhali : ఈడీ టార్గెట్ షేక్ షాజహాన్.. సందేశ్‌‌ఖాలీలో రెయిడ్స్..!

హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు సుప్రీం నిరాకరించింది. మరోవైపు టీఎంసీ అతడిని 6 ఏళ్ల పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.

by Venu

పశ్చిమ బెంగాల్ (West Bengal) సంచలనం సృష్టించిన సందేశ్‌ఖాలీ (Sandeshkhali) ఘటన నిందితుడు షేక్ షాజహాన్ (Sheikh Shah Jahan) టార్గెట్‌గా ఈడీ (ED) నేడు రెయిడ్స్ నిర్వహిస్తోంది. తృణమూల్ కాంగ్రెస్ (TMC) మాజీ నేత షేక్ షాజహాన్ అరెస్ట్ తర్వాత ఈడీ, పారామిలిటరీ బలగాలు ఈ రోజు నాలుగు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించాయి. మహిళా బలగాలను కూడా రంగంలోకి దింపారు.

ఈడీ అధికారులు గురువారం ఉదయం 6.30 గంటలకు షేక్ షాజహాన్‌కి చెందిన ఇటుక బట్టితో పాటు ధమఖలీ అనే ప్రాంతంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా రేషన్ పంపిణీ కుంభకోనాన్ని విచారించేందుకు వెళ్లిన ఈడీ అధికారులపై షేక్ షాజహాన్, అతని అనుచరులు దాడికి పాల్పడ్డారు. అక్కడి మహిళలను టార్గెట్ చేస్తూ లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.

దీంతో ఓపిక నశించిన స్థానిక మహిళలు షేక్ షాజహాన్, ఇతర టీఎంసీ నేతలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన, ఆందోళన కార్యక్రమాలను చేపట్టారు. ఈ ఘటనతో ఒక్కసారిగా సందేశ్‌ఖాలీ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. అదేసమయంలో షేక్ షాజహాన్ 55 రోజుల పాటు పరారీలో ఉన్నాడు. కాగా ఈ ఇష్యూను సీరియస్ గా తీసుకొన్న కలకత్తా హైకోర్టు.. సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ లేదా పోలీసులు అతన్ని అరెస్టు చేయవచ్చని ఆదేశించింది. ఇది జరిగిన మరుసటి రోజు బెంగాల్ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.

మరోవైపు ఈడీపై దాడి చేసిన కేసులో షేక్ షాజహాన్ ముగ్గురు అనుచరుల్ని సీబీఐ అరెస్ట్ చేసింది. కలకత్తా హైకోర్టు కేసును సీబీఐకి అప్పగించింది. అయితే, ఈ ఆదేశాలను అడ్డుకునేందుకు మమతా బెనర్జీ సర్కార్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు సుప్రీం నిరాకరించింది. మరోవైపు టీఎంసీ అతడిని 6 ఏళ్ల పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.

You may also like

Leave a Comment