తెలంగాణ (Telangana)లో అసెంబ్లీ ఎన్నికలు రాజకీయ నేతలకు లబ్ధి చేకూరేలా ఉన్నా.. కిందిస్థాయి సిబ్బంది ప్రాణాలకు మాత్రం సంకటంగా మారుతున్నాయని అంటున్నారు. ఇప్పటికే ఎన్నికల విధుల్లో పలువురు ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మరొక వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన సంగారెడ్డి (Sangareddy) జిల్లాలో చోటుచేసుకుంది.
ఎన్నికల పోలింగ్ విధుల్లో ఉన్న సుధాకర్ అనే 48 ఏళ్ల వ్యక్తి గుండెపోటు (Heart Attack)తో మరణించారు.. కొండాపూర్ వెటర్నటీ విభాగంలో అసిస్టెంట్ గా పని చేస్తున్న సుధాకర్ కు సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు (Patan Cheru) మండలం ఇస్నాపూర్ లో ఎన్నికల డ్యూటీ వేశారు.. పోలింగ్ బూత్ నెంబర్ 248లో సుధాకర్ ను పోలింగ్ సిబ్బందిగా కేటాయించారు అధికారులు..
పోలింగ్ బూత్ సెంటర్ లో ఓటింగ్ కు కావలసిన ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలో.. గుండెల్లో నొప్పి ఉందంటూ సుధాకర్ స్పహతప్పి పడిపోయాడు. అక్కడ ఉన్న సిబ్బంది వెంటనే.. సుధాకర్ ను సమీపంలోని పటాన్ చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అతన్ని పరీక్షించిన వైద్యులు.. సుధాకర్ అప్పటికే మృతి చెందినట్లు వెల్లడించారు.
కాగా సుధాకర్ మరణ వార్తను కుటుంబ సభ్యులకు తెలియజేసినట్టు అధికారులు తెలిపారు. మరోవైపు పోలింగ్ విధుల్లో సహ ఉద్యోగి మరణించడం.. అక్కడ ఉన్న మిగతా సిబ్బంది మనసులను కలిచివేసింది. అప్పటి వరకు తమ కళ్ల ముందు ఉన్న వ్యక్తి అకస్మాత్తుగా మరణించడాన్ని వారు జీర్ణించుకోలేక పోతున్నారు..