ఓ పరీక్షా కేంద్రంలో సంస్కృతం ఎగ్జామ్ ఒకే ఒక్క విద్యార్థిని హాజరుకాగా, ఎనిమిది మంది సిబ్బంది విధులు నిర్వర్తించారు. మధ్యప్రదేశ్(Madhya Pradesh)లోని అశోక్‌నగర్ జిల్లా(Ashoknagar District)లో ఈ విచిత్రం జరగగా అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మధ్యప్రదేశ్‌లో పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు ఇటీవలే ప్రారంభమయ్యాయి. అయితే అశోక్ నగర్ జిల్లాలో కేంద్రంలోని సరస్వతి శిశు మందిర్‌లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. మొత్తం 858 మంది అభ్యర్థులు హాజరు అవుతుండగా, అందులో 466 మంది సెకండరీ పరీక్షలు రాస్తున్నారు. అయితే 12వ తరగతి సంస్కృతం పరీక్ష బుధవారం జరిగింది.
ఈ పరీక్షకు సరస్వతి శిశు మందిర్‌కు మనీషా అహిర్వార్ అనే ఒక్క విద్యార్థిని మాత్రమే హాజరైంది. ఈ ఎగ్జామ్ సెంటర్‌కు గాను కలెక్టర్ ప్రతినిధి ఆకాశ్‌జైన్‌తో పాటు సూపర్‌వైజర్ సప్నా శర్మ, సెంటర్ హెడ్ అస్లాం బేగ్ మీర్జా, అసిస్టెంట్ సెంటర్ హెడ్ నిర్మలా చండేలియా, రాజ్‌కుమార్ ధురంతే, ఒక పోలీసు, ఇద్దరు ప్యూన్‌లను జిల్లా అధికారులు నియమించారు.
దీంతో బుధవారం ఒక్క మనీషానే పరీక్ష రాయడం వల్ల ఒక్క విద్యార్థిని- 8 మంది సిబ్బందిలా మారింది పరిస్థితి. నాలుగు కేంద్రంల్లో ఐదుగురు కన్నా తక్కువే అయితే అశోక్‌నగర్ జిల్లాలోని నాలుగు పరీక్షా కేంద్రాల్లో సంస్కృతం ఎగ్జామ్‌కు ఐదుగురు కన్నా తక్కువ విద్యార్థులు హాజరయ్యారని అధికారులు తెలిపారు.