Telugu News » Protocol : కొత్తపేటలో ప్రోటోకాల్ రగడ… సర్పంచ్, ఎంపీటీసీ అరెస్టు….!

Protocol : కొత్తపేటలో ప్రోటోకాల్ రగడ… సర్పంచ్, ఎంపీటీసీ అరెస్టు….!

ఈ సందర్బంగా ప్రోటోకాల్ రగడ రాజుకుంది. ఘర్షణ పూరిత వాతావరణం నెలకొనడంతో పోలీసు(Police)లు రంగ ప్రవేశం చేశారు.

by Ramu
sarpanch and mptc arrested in rangareddy district

రంగారెడ్డి జిల్లాలో ప్రోటోకాల్ (Protocol Issue)రగడ జరిగింది. కేశంపేట మండలం కొత్తపేటలో గ్రామపంచాయతీ నూతన భవన ప్రారంభోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రోటోకాల్ రగడ రాజుకుంది. ఘర్షణ పూరిత వాతావరణం నెలకొనడంతో పోలీసు(Police)లు రంగ ప్రవేశం చేశారు. కొత్తపేట సర్పంచ్ నవీన్, ఎంపీటీసీ మల్లేశ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

sarpanch and mptc arrested in rangareddy district

విషయం తెలుసుకున్న ఎంపీ శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అంజయ్య అక్కడకు చేరుకున్నారు. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. ఈ సందర్బంగా పోలీసులతో ఎంపీ వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సర్పంచ్, ఎంపీటీసీలను అరెస్టు ఎందుకు చేశారని పోలీసులను ఎంపీ ప్రశ్నించారు.

పంచాయతీ భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని సీఐ లక్ష్మీ రెడ్డి తెలిపారు. దీంతో అధికారులు తమకు ఫిర్యాదు చేశారని సీఐ చెప్పారు. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు సర్పంచ్, ఎంపీటీసీని అదుపులోకి తీసుకున్నామని ఎంపీకి వివరించారు. దీనిపై ఎంపీ అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయంపై కలెక్టర్‌తో మాట్లాడుతున్నట్టు ఎంపీ తెలిపారు.

మరోవైపు సర్పంచ్‌ను విడుదల చేయాలంటూ ఆందోళనకారులు నిరసనకు దిగారు. సర్పంచ్ ను విడుదల చేయాలంటూ నినాదాలు చేశారు. సర్పంచ్ ను అడ్డుకున్న వారిపై కేసులు పెట్టాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో సైబరాబాద్ కమిషనర్ కు ఎంపీ ఫోన్ చేసి
మాట్లాడారు.

You may also like

Leave a Comment