Telugu News » Satya Nadella: ‘ఆస్ట్రేలియాను కొనేస్తారా ఏంటీ..?’: పాడ్‌కాస్ట్‌లో మైక్రోసాఫ్ట్ సీఈవోకు ప్రశ్న..!

Satya Nadella: ‘ఆస్ట్రేలియాను కొనేస్తారా ఏంటీ..?’: పాడ్‌కాస్ట్‌లో మైక్రోసాఫ్ట్ సీఈవోకు ప్రశ్న..!

ఓటమి తర్వాత టీమ్ఇండియా ప్లేయర్లతో పాటు యావత్ దేశం తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలో మైక్రోసాఫ్ట్ సీఈవో(Microsoft CEO) సత్యనాదెళ్ల(Satya Nadella) ఓ పాడ్‌కాస్ట్‌లో ఫైనల్‌లో భారత్ ఓటమిపై ప్రశ్న ఎదురైంది.

by Mano
Satya Nadella: 'Would you like to buy Australia?': Question to Microsoft CEO on podcast..!

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఆదివారం జరిగిన 2023 వరల్డ్ కప్ ఫైనల్(World cup Final)లో ఆసీస్ చేతిలో టీమ్ఇండియా ఓటమిపాలైన సంగతి తెలిసిందే. అయితే, ఓటమి తర్వాత టీమ్ఇండియా ప్లేయర్లతో పాటు యావత్ దేశం తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలో మైక్రోసాఫ్ట్ సీఈవో(Microsoft CEO) సత్యనాదెళ్ల(Satya Nadella) ఓ పాడ్‌కాస్ట్‌లో ఫైనల్‌లో భారత్ ఓటమిపై ప్రశ్న ఎదురైంది.

Satya Nadella: 'Would you like to buy Australia?': Question to Microsoft CEO on podcast..!

వ్యాఖ్యత మాట్లాడుతూ వరల్డ్‌ కప్‌ గురించి ప్రస్తావించారు. ఆ తర్వాత టీమ్ఇండియా ఓటమిని గుర్తుచేసి.. ఆ ఓటమికి ప్రతీకారంగా ‘ఆస్ట్రేలియాను కొంటారా?’ అని సరదాగా ప్రశ్నించారు. దీనిపై సత్య నాదెళ్ల స్పందించారు. ‘ఆస్ట్రేలియాను కొనడం అంటే ఓపెన్‌ ఏఐను సొంతం చేసుకోవడం లాంటిదేనని.. ఆ రెండూ సాధ్యం కావని నవ్వుతూ బదులిచ్చారు. కానీ, ఓపెన్‌ ఏఐతో తాము భాగస్వాములం కాగలమని అన్నారు.

అదేవిధంగా ఆస్ట్రేలియా క్రికెట్‌ ఆడడాన్నీ ఆనందించగలమని అని సరదాగా బదులిచ్చారు. సత్య నాదెళ్ల క్రికెట్‌ అభిమాని. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో ఆయనే స్వయంగా వ్యక్తం చేశారు. 2023 వరల్డ్ కప్లో భాగంగా గత బుధవారం న్యూజిలాండ్‌, భారత్‌ మధ్య జరిగిన సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ను రాత్రంతా మేల్కొని మరీ చూసినట్లు తెలిపారు.

అయితే వరల్డ్ కప్ ఫైనల్‌ మ్యాచ్‌ను సైతం సత్య నాదెళ్ల వీక్షించారు. ఆస్ట్రేలియా విజయం ఖరారు కాగానే x(ట్విట్టర్) వేదికగా ఆ జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు. సత్యనాదెళ్ల క్రికెట్ గురించి పలు సందర్భాల్లో స్పందించారు. ఈ ఆటే తనకు టీమ్‌లో కలిసి పనిచేయడాన్ని, నాయకత్వాన్ని నేర్పించిందని ఆయన మైక్రోసాఫ్ట్‌ సీఈవోగా నియమితులైన సమయంలో వెల్లడించారు.

You may also like

Leave a Comment